ETV Bharat / bharat

ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్‌.. 55 వేలకు పైగా ఉద్యోగాలు!

2022-23 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్‌ల నుంచి 55 వేలకు పైగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్​ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు.

infosys jobs
infosys jobs
author img

By

Published : Feb 16, 2022, 9:16 PM IST

Infosys Jobs: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ ఫ్రెషర్స్‌కు సువర్ణావకాశం కల్పించనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్‌ల నుంచి 55వేలకు పైగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. టెక్‌ రంగంలో ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని, దాన్ని అందిపుచ్చుకోవడానికి నిత్యం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. బుధవారం నాస్కామ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 55 వేల మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోబోతున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం అంతకంటే ఎక్కువ మందిని నియమించుకోబోతున్నట్లు సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20 శాతం మేర వృద్ధి ఉండే అవకాశం ఉందని చెప్పారు. కంపెనీలో చేరి, ఎదిగేందుకు ఫ్రెషర్స్‌కు ఇదో సదావకాశం అని చెప్పారు.

నైపుణ్యం కలిగిన మానవ వనరులపై కంపెనీ దృష్టి పెట్టిందన్న ఆయన.. ఫ్రెషకు ఉద్యోగం కల్పించే ముందు ఆరు నుంచి 12 నెలల శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు కూడా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. అయితే, టెక్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టబోయే కొత్తవారు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. టెక్నాలజీ రంగం ఎప్పటికప్పుడు వేగంగా మార్పులకు లోనవుతోందని చెప్పారు. అందుకే 3-5 ఏళ్లకోసారి కొత్త స్కిల్స్‌ నేర్చుకోవాల్సి ఉంటుందని పరేఖ్‌ తెలిపారు.

ఇవీ చూడండి: ఒకేసారి 24 మంది భాజపా నేతలకు 'వీఐపీ భద్రత'!

'ఆ ఆంక్షలు ఎత్తేయండి!'.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.