ETV Bharat / bharat

8 ఏళ్ల వయసులోనే యోగాపై కవలల పుస్తకం

author img

By

Published : Jun 21, 2021, 1:06 PM IST

Updated : Jun 21, 2021, 1:37 PM IST

యోగా గొప్పతనాన్ని మరింత మందికి చాటి చెప్పేలా సూర్య నమస్కారాలు పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు.. మధ్యప్రదేశ్​ ఇందోర్​కు చెందిన ఇద్దరు చిన్నారులు. యోగాసనాలకు సంబంధించి పెయింటింగ్స్​ను కూడా వారు వేశారు.

twins pen book on yoga news
యోగాపై చిన్నారుల పుస్తకం
8 ఏళ్ల వయసులోనే యోగాపై పుస్తకం రాసిన చిన్నారులు

యోగా విశిష్టతను మరింత మందికి చేరువ చేసేలా... మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని ఓ ఇద్దరు చిన్నారులు వినూత్నంగా ఆలోచించారు. 'సూర్య నమస్కారాలు' పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. అంతేకాదు.. యోగాసనాలకు సంబంధించిన పెయింటింగ్స్​నూ వారు రూపొందించారు. ఈ పుస్తకాన్ని, పెయింటింగ్స్​ను ఇందోర్​ విమానాశ్రయంలో ఆదివారం విడుదల చేశారు.

దేవయానీ భరద్వాజ్​(8), శివరంజని భరద్వాజ్(8)​ అనే మూడో తరగతి చదివే ఇద్దరు కవలలు ఈ పుస్తకాన్ని రాశారు. ప్రకృతితో మమేకమై యోగసనాలు వేస్తున్న మనుషుల చిత్రాలను వారు వేశారు. వీటిని మాజీ మేయర్​ మాలినీ గౌర్​, పద్మశ్రీ పురస్కార గ్రహీత జానక్​ పాల్తా సమక్షంలో ఇందోర్​ విమానాశ్రయ అధికారులు విడుదల చేశారు.

twins written book on yoga
దేవయానీ భరద్వాజ్​, శివరంజని భరద్వాజ్

ఇక్కడే ఉంచుతాం..

యోగాసనాల చిత్రాలను ఈ చిన్నారులు అద్భుతంగా చిత్రీకరించారని విమానాశ్రయ డైరెక్టర్​ ఆర్యమా సన్యాల్ ప్రశంసించారు. వారి పెయింటింగ్స్​ను తాము విమానాశ్రయంలో ప్రదర్శిస్తామని చెప్పారు. తద్వారా ప్రయాణికులు యోగా దినోత్సవ విశిష్టతను తెలుసుకుంటారని చెప్పారు. మరో 15 రోజులు వీటిని ఇక్కడే అమ్మకానికి ఉంచుతామని పేర్కొన్నారు.

twins written book on yoga
తాము గీసిన పెయింటింగ్స్​ వద్ద చిన్నారులు

మరోవైపు.. 7వ అంతర్జాతీయ దినోత్సవ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రసంగించారు. కరోనా విపత్తు వేళ యోగా.. ఆశాకిరణంగా మారిందని పేర్కొన్నారు. వైరస్​తో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా వ్యాధినిరోధక శక్తితో పాటు అంతర చైతన్యమూ పెరుగుతుందని అన్నారు.

ఇదీ చూడండి: Yoga Day: దేశవ్యాప్తంగా ఫిట్​ ఇండియా యోగా సెంటర్లు

ఇదీ చూడండి: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వెబినార్

Last Updated : Jun 21, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.