ETV Bharat / bharat

ఐదోసారి స్వచ్ఛ ర్యాంక్​పై కన్నేసిన 'ఇందోర్​'

author img

By

Published : Mar 26, 2021, 2:58 PM IST

స్వచ్ఛనగరాల జాబితాలో వరుసగా 4సార్లు తొలిస్థానం నిలిచిన ఇందోర్.. మరోసారి తొలి ర్యాంకుపై కన్నేసింది. ఇందుకు తీవ్ర స్థాయిలోనే కసరత్తు చేస్తోంది. 2017లో పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థను మెరుగుపరిచే పనులు ప్రారంభించిన స్వచ్ఛ నగరం.. 2018లో తోటల నుంచి చెత్తను సేకరించి, ఎరువుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

Indore trying to get first rank as a Clean city
ఐదోసారి స్వచ్ఛ ర్యాంక్​పై కన్నేసిన 'ఇండోర్​'
ఐదోసారి స్వచ్ఛ ర్యాంక్​పై కన్నేసిన 'ఇందోర్​'

దేశంలోనే స్వచ్ఛనగరాల జాబితాలో వరుసగా నాలుగు సార్లు నంబర్‌ వన్‌గా నిలిచిన నగరం ఇందోర్. ఈ జాబితాలో 61వ స్థానంలో ఉన్న ఇందోర్.. మొట్టమొదటి స్థానానికి ఎగబాకి, అక్కడే స్థిరపడిపోయింది. ఈ ఏడాది ఐదోసారి కూడా ఆ ఘనత దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది ఈ స్వచ్ఛ నగరం.

"దేశంలోనే మా జిల్లాను నంబర్ వన్‌గా నిలిపేందుకు ఓ నియమావళి రూపొందించుకున్నాం. గడిచిన ఆరు నెలల్లో కొత్త కార్యాచరణ చేపట్టాం. జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, సీఈఓ, కలెక్టర్ కలిసి గ్రామాల్లోకి ఉదయం నాలుగు గంటలకే వెళ్లేవాళ్లం. ఆ సమయంలోనే ప్రజలు బహిరంగ మలవిసర్జనకు వెళ్తారు. అది సరైనది కాదని చెప్పేందుకు అవకాశం దొరికేది. ఆరునెలల్లోనే ప్రజల్లో మార్పు వచ్చింది. కొంతమంది పిల్లల బృందానికి వానర సేన అని పేరు పెట్టి, పెద్దలకు వాళ్ల ద్వారా అవగాహన కల్పించాం. ఆరు నెలల్లోపే ఇందోర్‌ పరిసర ప్రాంతాలనూ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా మార్చాం. దేశంలో ఈ ఘనత సాధించిన రెండో జిల్లా మాది."

- నరహరి, కలెక్టర్

2017లో పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థను మెరుగుపరిచే పనులు ప్రారంభించారు. మొదటి సారిగా ఇంటింటి నుంచీ చెత్తను సేకరించే ప్రణాళికలు చేశారు. ఆధునిక యంత్రాలు, వాహనాలు సిద్ధం చేశారు. ఇళ్ల నుంచి రోజుకొకసారి, పారిశ్రామిక ప్రాంతాల నుంచి రోజుకు రెండుసార్లు చెత్త సేకరణ చేపట్టారు. ఇందోర్వ్యాప్తంగా 10 ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డుకు చెత్తను తీసుకెళ్తారు.

"2015-16లో స్వచ్ఛత జాబితాలో ఇందోర్ స్థానం మెరుగుపడిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్.. మరింత అప్రమత్తమైంది. వాల్మీకి సొసైటీతో చేతులు కలిపి, ప్రజల సహకారంతో నిరంతరం కృషి చేసింది. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. తమ నగరాన్ని స్వచ్ఛంగా మార్చుకోవాలన్న లక్ష్యంతో ప్రజలూ తమ పూర్తి సహకారమందించారు."

- మనీష్ సింగ్, కలెక్టర్

2017లో దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరం టైటిల్ సొంతం చేసుకునేందుకు ఇందోర్ ఎంతో కృషి చేసింది. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి, తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తారు. పొడి చెత్త నుంచి వివిధ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. తడి చెత్తను నగరంలోని మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. 2018లో తోటల నుంచి చెత్తను సేకరించి, ఎరువుగా తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ ఎరువును తిరిగి అదే తోటలో వినియోగిస్తారు.

"ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తతో సఫాయి మిత్ర ఏర్పాటు చేశాం. ఈ గార్డెన్ సఫాయి మిత్రకే కేటాయించాం. మాకోసం వాళ్లు 4 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నారు. మరోసారి స్వచ్ఛతలో సత్తా చాటుతాం."

- స్థానికురాలు

2019లో మున్సిపల్ కార్పొరేషన్ 3-ఆర్​ విధానాన్ని అవలంబిస్తోంది. రీసైకిల్, రెడ్యూజ్, రీయూజ్ ప్రాతిపదికన పనిచేస్తోంది. నగరంలోని గోడలన్నింటికీ సున్నాలేశారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. 7వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. రాత్రుల్లో నగరవ్యాప్తంగా రహదారులన్నీ యంత్రాలతో ఊడుస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, నిబంధనలు అతిక్రమించినా.. జరిమానా వసూలు చేస్తున్నారు.

"సర్వేలో ఇందోర్ నాలుగేళ్లుగా నంబర్‌ 1గా నిలుస్తోంది. ఏటా ఏదైనా కొత్తగా చేస్తాం. స్వచ్ఛతలో ఇందోర్ ప్రతిసారీ ఉదాహరణగా నిలుస్తోంది. ఈ నగరంలోని ప్రజలు అభివృద్ధి పనులు చేస్తారు. మొట్టమొదటి స్థానంలో నిలిచేందుకు ఇందోర్ చేస్తున్న ఈ ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుంది. ప్రజల భాగస్వామ్యం, వారి ఆసక్తితో నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటాం."

- ప్రతిభా పాల్, మున్సిపల్ కమిషనర్

2021 సంవత్సరంలోనూ స్వచ్ఛతలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది ఇందోర్. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ఇందుకు ప్రధాన కారణం. నగరవ్యాప్తంగా మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మురుగు నీరు నదుల్లో కలవకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని ఎన్నో మురుగుకాల్వలు ఇప్పటికే ఎండిపోయాయి.

ఇదీ చూడండి: చరిత్రలో కప్పడ్​ బీచ్​ ప్రత్యేకం- ప్రకృతి శోభితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.