ETV Bharat / bharat

'టీకా కేంద్రం'లో పుట్టినరోజు వేడుకలు

టీకా కేంద్రంలో కరోనా నిబంధనలు పాటించకుండానే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు మధ్యప్రదేశ్​కు చెందిన భాజపా నాయకురాలు. టీకా కేంద్రంలో వేడుకలు జరపటం అభ్యంతకరమని జిల్లా ఇమ్యునైజేషన్​ అధికారి డా. ప్రవీణ్ కుమార్ అన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

madyapradesh bjp leader celebrate birthday in tika centre
టీకా కేంద్రంలో భాజపా నేత పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : Jun 6, 2021, 12:46 PM IST

టీకా కేంద్రంలో భాజపా నేత పుట్టినరోజు వేడుకలు

మధ్యప్రదేశ్​లోని ఓ భాజపా నాయకురాలు కరోనా నిబంధనలు పాటించకుండా టీకా కేంద్రంలోనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. టీకా కేంద్రంలో వ్యాక్సిన్​ పంపిణీ జరుగుతుండగా.. ఇందోర్​కు చెందిన 58వ వార్డు అధ్యక్షురాలు మాధురీ జైశ్వాల్​ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలు భౌతిక దూరం పాటించలేదు. పలువురు మాస్క్​లు లేకుండానే కనపడ్డారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. దీనిపై స్పందించిన జిల్లా ఇమ్యునైజేషన్​ అధికారి డా. ప్రవీణ్ కుమార్​.. జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. టీకా కేంద్రంలో వేడుకలు జరపటం అభ్యంతరకమని అన్నారు.

అయితే తన మద్ధతుదారులు ఈ వేడుకలను నిర్వహించారని.. అందుకు క్షమాపణ కోరుతున్నట్లు జైశ్వాల్​ తెలిపారు.

"మా కుటుబంలో ఇటీవలే ఓ వ్యక్తిని కోల్పోయాం. ఈ విషాద సమయంలో నేనే నా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోలేకపోయాను. నేను టీకా పంపిణీ చేస్తున్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేసరికే.. నా ఆనందం కోసం మా కార్యకర్తలు వేడుకలకు సిద్ధం చేశారు. వారు కరోనా నిబంధనలు పాటించలేదనే విషయం నాకు తెలియదు. ఈ విషయంపై నేను క్షమాపణ కోరుతున్నాను."

-మాధురీ జైశ్వాల్, వార్డ్​ అధ్యక్షురాలు​

ఇవీ చదవండి:

టీకా తీసుకోకుండా తిరిగితే.. రూ.500 ఫైన్!

'కరోనాపై పోరాటం కోసం హోమం చేయాల్సింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.