ETV Bharat / bharat

భారత నౌకా దళంలోకి 'ఐఎన్​ఎస్​ విశాఖపట్నం'

తూర్పు సముద్ర తీర పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్న యుద్ధ నౌక ఐఎన్​ఎస్​-విశాఖపట్నం(ins visakhapatnam destroyer) విధుల్లోకి చేరింది. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Defence minister Rajnath singh) ఈ నౌకను జాతికి అంకితం చేశారు. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో బ్రహ్మోస్‌ సహా అనేక అధునాతన క్షిపణులను ప్రయోగించేలా తీర్చిదిద్దిన ఈ నౌక.. విధుల్లో చేరడం(ins visakhapatnam commissioning) ప్రాధాన్యం సంతరించుకుంది. నౌక ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి.. చైనాపై పరోక్ష విమర్శలు గుప్పించారు.

visakhapatnam
భారత నౌకా దళంలోకి 'ఐఎన్​ఎస్​-విశాఖపట్నం'
author img

By

Published : Nov 21, 2021, 12:59 PM IST

Updated : Nov 21, 2021, 2:59 PM IST

భారతదేశ సముద్ర తీరంలో ఎంతో వ్యూహాత్మకమైన తూర్పు తీర రక్షణను మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. అనేక ప్రత్యేకతలకు సమాహారమైన యుద్ధ నౌక ఐఎన్​ఎస్​-విశాఖపట్నం(ins visakhapatnam destroyer) విధుల్లో చేరింది. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Defence minister Rajnath singh) ఈ నౌకను జాతికి అంకితం చేశారు(ins visakhapatnam commissioning). ఈ నౌకను విశాఖపట్నంలో మోహరించనున్నారు.

Rajnath Singh
గౌరవ వందనం స్వీకరిస్తున్న రాజ్​నాథ్​ సింగ్​

చైనా దుస్సాహసంతో హిందూ మహా సముద్రంలో సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం(ins visakhapatnam) విధుల్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. నౌకను ప్రారంభించిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాపై పరోక్ష విమర్శలు గుప్పించారు. దేశాల ప్రాదేశిక సముద్ర జలాల పరిరక్షణ కోసం రూపొందించిన ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ చట్టం.. అన్‌క్లాజ్‌కు చైనా కొత్త భాష్యాలు చెబుతూ దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. చైనాను రాజ్‌నాథ్‌ బాధ్యతారాహిత్య దేశంగా అభివర్ణించారు.

Rajnath Singh
గౌరవ వందనం స్వీకరిస్తున్న రక్షణ మంత్రి

" 1982-ఐరాస కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ చట్టం అన్‌క్లాజ్‌.. దేశాల ప్రాదేశిక సముద్ర జలాల పరిరక్షణ సహా, సముద్రంలో నిబంధనలను అనుసరించాలని ప్రతిపాదించింది. కాని కొన్ని దేశాలను నేను బాధ్యతారాహిత్య దేశాలు అని పిలవాలని భావిస్తున్నాను. ఆ దేశాలు తమ సంకుచిత, పక్షపాత ప్రయోజనాలు, ఆధిపత్య ధోరణులతో అన్‌క్లాజ్‌ వంటి అంతర్జాతీయ చట్టాలకు కొత్త కొత్త నిర్వచనాలు ఇస్తున్నాయి. వ్యవస్థ దృష్టిలో ఆ చట్టంలోని నిబంధనలు చాలా కీలకమైనవి. కాని కొన్ని దేశాలు తమకు తోచిన వ్యాఖ్యలు చేస్తూ ఈ నిబంధనలను తరచూ బలహీనపరుస్తున్నాయి."

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

తూర్పు లద్దాఖ్‌(east ladakh news) పరిణామాల నేపథ్యంలో భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా(china india standoff) ప్రయత్నిస్తే గట్టి జవాబు తప్పదని చైనాను హెచ్చరించిన ఒక్క రోజులోనే రాజ్‌నాథ్‌ డ్రాగన్‌కు భారత దేశ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు రాజ్​నాథ్​.

ప్రత్యేకతలెన్నో..

నౌకలకు ప్రముఖ నగరాల పేర్లను పెట్టే సంప్రదాయానికి అనుగుణంగా విశాఖకు కేటాయించిన నౌకకు ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం(ins visakhapatnam commissioning) అని నామకరణం చేశారు. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం భారతదేశ తొలి స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ కావడం విశేషం. ముంబయి మజగావ్ డాక్‌లో ఈ నౌకను దేశీయంగా నిర్మించారు. బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను దీని నుంచి ప్రయోగించవచ్చు. ఈ నౌక కదలికల్ని శత్రుదేశ రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తిమంతమైన టోర్పెడోలను పొందుపరిచారు. రెండు మల్టీరోల్‌ హెలికాప్టర్లు ఇందులో ఉంటాయి. నౌక శిఖర భాగంలో ఏర్పాటు చేసే ముద్రకు విశాఖలోని డాల్ఫిన్‌ నోస్‌ కొండ, దానిపై దీప స్తంభానికి స్థానం కల్పించారు. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌక గుర్తింపు చిహ్నంగా కొమ్ములతో కనిపించే కృష్ణ జింక ముఖం ముందుభాగాన్ని ఖరారు చేశారు. అత్యంత అప్రమత్తతకు, తీవ్రమైన వేగానికి కృష్ణజింకలు నిదర్శనంగా నిలుస్తాయన్న ఉద్దేశంతో ఆ చిహ్నాన్ని పొందుపరిచారు. అప్రమత్తతో, పరాక్రమంతో.. విజేతగా నిలువాలన్న లక్ష్యాన్ని చిహ్నం కింద చేర్చారు.

ఇదీ చూడండి: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్​ఎస్​ కరంజ్​

Last Updated : Nov 21, 2021, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.