భారత్లో కరోనా ప్రళయం సృష్టిస్తుంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 3,79,257 కేసులు వెలుగుచూశాయి. మరో 3,645 మరణాలు సంభవించాయి. కొత్తగా 2,69,507 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 1,83,76,524
- మొత్తం మరణాలు: 2,04,832
- మొత్తం కోలుకున్నారు: 1,50,86,878
- మొత్తం యాక్టివ్ కేసులు: 30,84,814
కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 15 కోట్ల 20లకు పైగా టీకాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ వ్యూహంతో వైరస్ వ్యాప్తి నియంత్రణకు అధికారులు ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా బుధవారం.. 17,68,190 నమూనాలు పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 28 కోట్ల 44 లక్షల 71 వేలు దాటింది.
ఇదీ చూడండి: భారత్కు.. అమెరికా 100 మి.డాలర్ల వైద్య సామగ్రి సాయం