ETV Bharat / bharat

దేశంలో మొట్టమొదటి స్మాగ్​ టవర్​.. ఎక్కడంటే? - స్మాగ్​ టవర్​ వార్తలు

దిల్లీలో గాలి కాలుష్యానికి చెక్​ పెట్టే దిశగా.. దేశంలో మొట్టమొదటి సారిగా స్మాగ్​ టవర్​ నిర్మించింది అక్కడి ప్రభుత్వం. సోమవారం ఈ టవర్​ను ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ప్రారంభించారు.

India's first smog tower
మొట్టమొదటి స్మోగ్​ టవర్​
author img

By

Published : Aug 23, 2021, 3:52 PM IST

దిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యానికి చెక్​ పెట్టేందుకు అక్కడి ప్రభుత్వం స్మాగ్​ టవర్​ను ఏర్పాటు చేసింది. దీనిని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కన్నాట్​ ప్లేస్​​లో ప్రారంభించారు. దీన్ని ఓ మైలురాయిగా అభివర్ణించారు కేజ్రీవాల్. పైలెట్​ ప్రాజెక్ట్​గా చేపట్టిన ఈ టవర్​ మంచి ఫలితాలు ఇస్తే.. నగరంలో ఇటువంటి నిర్మాణాలు మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

దేశంలో ఇదే మొట్టమొదటి స్మాగ్​ టవర్​ నిర్మాణం కావడం విశేషం.

India's first smog tower inaugurated in Delhi
స్మాగ్​ టవర్​ను ప్రారంభించిన ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​

"ఇది దేశంలో మొట్టమొదటి స్మాగ్ టవర్. ఇది ఒక కొత్త టెక్నాలజీ. మేము దీనిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఈ నిర్మాణం కలుషితమైన గాలిని పీల్చుకుని.. దిగువ నుంచి స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది. ఇది సెకనుకు 1,000 క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. ఈ టవర్​ నిర్మాణంతో గాలిలో ఉండే ఫైన్​పార్టికల్స్(పీఎం2.5) గాఢతను క్యూబిక్​ మీటరుకు 150 మైక్రో గ్రాముల నుంచి 100 మైక్రోగ్రాములకు తగ్గించవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలతో 2014 నుంచి దిల్లీలో పీఎం10 గాఢత 300మైక్రోగ్రాముల నుంచి 150మైక్రోగ్రాములకు తగ్గింది."

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

ఈ పీఎం205 అనేది మానవుని శరీరంలోకి పోయి ఊపిరితిత్తుల, శ్వాసకోశ వ్యాధులను కలగజేస్తుంది. అంతేగాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది.

దిల్లీలో ఏర్పాటు చేసిన స్మోగ్​ టవర్​

దేశంలో మొదటిసారిగా ఇలాంటి టవర్​ నిర్మాణం జరిగింది. ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. బాంబే ఐఐటీ, దిల్లీ ఐఐటీ సాంకేతిక సహకారంతో టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​ స్మాగ్ టవర్‌ను నిర్మించింది. దీని ఫలితాలు మరో నెల రోజుల్లో కనిపిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: అక్టోబర్​లో తీవ్రస్థాయికి కరోనా 3.0- బడులు​ తెరిచేదెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.