Sanitary napkin free panchayat: 'కుంబలంగి'.. కేరళ ఎర్నాకులం జిల్లాలో ఓ చిన్న లంక గ్రామం. ఫహద్ ఫాజిల్ నటించిన 'కుంబలంగి నైట్స్' సినిమా ద్వారా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం దేశంలోనే శానిటరీ నాప్కిన్ రహిత తొలి పంచాయతీగా నిలిచింది. 'అవల్కాయి(ఆమె కోసం)' అనే కార్యక్రమం ద్వారా రుతుస్రావం అయ్యే మహిళలు శానిటరీ నాప్‌కిన్‌కు బదులుగా మెన్స్ట్రువల్ కప్స్‌ను వాడేలా చేసి ఈ ఘనతను సాధించింది.

శానిటరీ నాప్కిన్ల వాడకాన్ని పూర్తిగా తగ్గించేందుకు.. 'అవల్కాయి' కార్యక్రమాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సాయంతో అమలు చేశారు. రుతుస్రావం అయ్యే మహిళలకు మెన్స్ట్రువల్ కప్స్ పంపిణీ చేసి వారు ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో నాప్కిన్ రహిత గ్రామంగా నిలిచింది కుంబలంగి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 5000కుపైగా మెన్స్ట్రువల్ కప్పులను పంపిణీ చేశారు. 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ కప్పులు ఇవ్వాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అలాగే.. శానిటరీ నాప్కిన్తో పోలిస్తే మెన్స్ట్రువల్ కప్స్ చాలా తక్కువ ధరకే లభించటం, పర్యావరణహితంగా ఉండటం వంటి ఉపయోగాలపై మహిళలకు అవగాహన కల్పించారు.
ఇటీవల కుంబలంగిలో నిర్వహించి ఓ కార్యక్రమంలో శానిటరీ నాప్కిన్ రహిత గ్రామంగా ప్రకటించారు ఆ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ ముహమ్మెద్ ఖాన్.

ఇదీ చూడండి: