బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన దేశంలోని మొట్టమెదటి ఎక్స్‌ప్రెస్ కార్గో టెర్మినల్‌ను ఆదివారం ప్రారంభించారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ టెర్మినల్‌ను అంతర్జాతీయ కొరియర్ల సరఫరా కోసం వినియోగించనున్నారు.

అంతర్జాతీయ కొరియర్ సంస్థలు జీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్, ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్.. ఈ టెర్మినల్ నుంచి కార్యకలాపాలు సాగించనున్నాయి.
ఏటా 5,70,000 మెట్రిక్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరిగే బెంగుళూరు విమానాశ్రయంలో ఎక్స్‌ప్రెస్ కార్గో టెర్మినల్ ఏర్పాటుతో 1,50,000 మెట్రిక్ టన్నుల వస్తు రవాణా పెరగనుంది.

ఇదీ చదవండి:'దేశాన్ని విభజించే శక్తులతో కాంగ్రెస్ పొత్తు'