భారత్లో కరోనా కేసులు(Coronavirus update) రెండో రోజు పెరిగాయి. కొత్తగా 31,923 మంది కొవిడ్ (Covid cases in India) బారినపడ్డారు. మరో 282 మంది మృతిచెందారు. ఒక్కరోజే 31,990 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 33,563,421
- మొత్తం మరణాలు: 4,46,050
- మొత్తం కోలుకున్నవారు: 3,28,15,731
- యాక్టివ్ కేసులు: 3,01,604
టీకాల పంపిణీ..
దేశంలో ఇప్పటివరకు 83,39,90,049 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం ఒక్కరోజే 71,38,205 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల సంఖ్యలో (Global corona virus update) భారీగా పెరుగుదల నమోదైంది. తాజాగా 5,28,265 మందికి కొవిడ్ (Corona update) సోకింది. వైరస్ ధాటికి మరో 9,319 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,08,82,741కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,32,838కి పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికా - 133,620
- బ్రెజిల్ - 36,473
- రష్యా - 19,706
- బ్రిటన్ - 34,460
- టర్కీ - 28,168
- ఇరాన్ - 17,433
ఇదీ చూడండి :కేరళలో మళ్లీ కొవిడ్ విజృంభణ- కొత్తగా 19 వేల కేసులు