Indians in Ukraine: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రొమేనియా నుంచి 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్ ఇండియా తొలి విమానం ముంబయికి చేరుకుంది. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రేయిన్ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఉక్రేయిన్లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని సూచించారు. సురక్షితంగా భారత్కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
-
#WATCH | Union Minister Piyush Goyal welcomes the Indian nationals safely evacuated from Ukraine at Mumbai airport pic.twitter.com/JGKReJE1ct
— ANI (@ANI) February 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Union Minister Piyush Goyal welcomes the Indian nationals safely evacuated from Ukraine at Mumbai airport pic.twitter.com/JGKReJE1ct
— ANI (@ANI) February 26, 2022#WATCH | Union Minister Piyush Goyal welcomes the Indian nationals safely evacuated from Ukraine at Mumbai airport pic.twitter.com/JGKReJE1ct
— ANI (@ANI) February 26, 2022
మాతృభూమికి స్వాగతం: పీయూష్ గోయల్..
ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబయి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వెల్కమ్ బ్యాక్ టు మదర్ ల్యాండ్ అంటూ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడి ముబయి విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత కోసం అవిశ్రాంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. రెండో బ్యాచ్ త్వరలోనే దిల్లీ చేరుకుంటుందని తెలిపారు.
రొమేనియా రాజధాని నగరం బుకారెస్ట్ నుంచి భారత్కు శనివారం మధ్యాహ్నం 1.55 గంటలకు ఈ విమానం బయలుదేరింది. ఆ దేశ సహకారంతో ఉక్రేయిన్లో చిక్కుకున్న మిగతా వారిని కూడా స్వదేశానికి సురక్షితంగా చేర్చేలా కేంద్రం కృషి చేస్తోంది. 16వేల మందికిపైగా భారతీయులు ఉక్రేయిన్లో చిక్కుకున్నారు.
ఇదీ చూడండి : సుప్రీంకోర్టు బార్ అధ్యక్షుడికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ బౌలింగ్..!