ETV Bharat / bharat

'టీకాలనూ తప్పించుకునే వైరస్‌ రకాలు' - కరోనాపై ఐజీఐబీ కథనాలు

కరోనా వైరస్ వేరియంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ)' హెచ్చరించింది. టీకాలను సైతం తట్టుకునే ఉద్ధృతమైన వైరస్‌ రకాలు వస్తే వాటిని ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉండాలన్నారు ఐజీఐబీ డైరెక్టర్‌ డా. అనురాగ్‌ అగర్వాల్‌. ఈ మేరకు 'ఈటీవీ భారత్‌'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. వైరస్​ రకాలు, టీకాల సామర్థ్యం, మూడో దశ వంటి పలు అంశాలపై మాట్లాడారు.

IGIB director
'టీకాలనూ తప్పించుకునే వైరస్‌ రకాలు'
author img

By

Published : Jun 11, 2021, 6:10 AM IST

కరోనా వైరస్‌లో అత్యంత ఉద్ధృతంగా వ్యాప్తి చెందే రకాలు వస్తే.. అవి టీకా ప్రభావం నుంచి తప్పించుకునే ప్రమాదం ఉందని 'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ)' హెచ్చరించింది. కరోనా రెండో ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండగానే సర్వత్రా మూడో ఉద్ధృతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది అప్రమత్తత సంకేతాలను ఇచ్చింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కరోనా కట్టడి నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ 'ఈటీవీ భారత్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

'సిద్ధంగా ఉండాలి..'

ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రణాళికలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, పటిష్ఠ ప్రజారోగ్య చర్యలు, ప్రజల్లో అవగాహన కారణంగా కొవిడ్‌ తదుపరి ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. "అయితే అన్ని రకాల ముప్పులకు మనం సన్నద్ధంగా ఉండాలి. టీకాలనూ ఏమార్చే మరింత ఉద్ధృతమైన వైరస్‌ రకాలను ఎదుర్కొనేందుకూ సిద్ధపడాలి. ఒకవేళ అలాంటివి వస్తే మూడో ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా అలాంటి వైరస్‌ రకాలను ప్రారంభంలోనే పసిగట్టే ఉద్దేశంతో ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్‌ కన్సార్షియం (ఇన్సాకాగ్‌)ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

డెల్టా వేరియంట్‌ సహా ఇప్పటివరకూ వచ్చిన అన్ని కరోనా రకాలపై భారతీయ వ్యాక్సిన్లు సమర్థంగానే పనిచేస్తున్నాయని అనురాగ్‌ చెప్పారు. రాబోయే రోజుల్లోనూ అవి పనిచేస్తూనే ఉంటాయన్నారు. భవిష్యత్‌లో తలెత్తబోయే అన్ని ఉద్ధృతులను ఎదుర్కొనేలా ప్రజారోగ్యపరంగా మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇదీ చదవండి: Covid: వేలి గోళ్లు రంగు మారుతున్నాయా?

ఇదీ చదవండి: ఆ వయసు పిల్లలకు మాస్కు అవసరం లేదా?

కొవాగ్జిన్‌, కొవిషీల్డ్​ల రక్షణ..

భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు తీవ్రస్థాయి కొవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నాయని డాక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. మున్ముందు తలెత్తే కొత్త వైరస్‌ రకాలపై ఈ వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంతమేర ఉంటుందో తెలుసుకోవడానికి వాటిపై నిరంతరం అధ్యయనం కొనసాగించాలన్నారు. కొన్ని వైరస్‌ రకాలపై ఇప్పుడున్న వ్యాక్సిన్లు సరిగా పనిచేయకపోవచ్చని, దీనివల్ల దేశంలో మూడో ఉద్ధృతి తలెత్తవచ్చని కొందరు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అనురాగ్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

'అందుకు ఆస్కారం..'

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లో ఉత్పన్నమయ్యే భిన్న వేరియంట్లు భారత్‌లో మూడో ఉద్ధృతికి దారితీయవచ్చన్న అంచనాలతో దేశంలో వైరస్‌ జన్యుక్రమాలను విశ్లేషించే ప్రయోగశాలల్ని 10 నుంచి 20కి కేంద్ర ఆరోగ్యశాఖ పెంచింది. దీనివల్ల ఆందోళనకరమైన రకాలను వేగంగా గుర్తించొచ్చు. ఈ ప్రయోగశాలలు విస్తృతంగా నమూనాలను సేకరించి అధ్యయనం చేస్తాయి. దీంతో కరోనా వైరస్‌ రకాలు ఎంతమేర విస్తరించాయన్నది తెలుసుకోవచ్చు. ప్రస్తుతమున్న 10 ల్యాబ్‌ల్లో 30 వేల నమూనాల జన్యుక్రమాన్ని విశ్లేషించారు. ప్రధానంగా డెల్టా వేరియంట్‌ కారణంగా భారత్‌లో రెండో ఉద్ధృతి తలెత్తింది. ఇది కాక కప్పా అనే మరో వేరియంట్‌ కూడా ప్రబలంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కరోనా వేరియంట్లకు కొత్త సంకేత నామాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి: ఆ రకం వైరస్​తో మూడో దశ ముప్పు!

మనిషి 150 ఏళ్లు జీవించగలడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.