ETV Bharat / bharat

18 రాష్ట్రాలకు పాకిన 'కొత్త రకం' కరోనా - కేంద్ర ఆరోగ్య శాఖ వార్తలు

దేశంలో కరోనా అంతకంతకూ విస్తరిస్తున్న తరుణంలో.. వైరస్​పై మరిన్ని ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. వైరస్​ నిత్యం మార్పులు చెందుతోందని తాజా అధ్యయనాల్లో వెల్లడైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. విదేశాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ వైరస్​లు.. భారత్​లో 18రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపిస్తున్నట్టు తెలిపింది.

Corona Virus Genetics
18 రాష్ట్రాలకు పాకిన 'కొత్త రకం' కరోనా
author img

By

Published : Mar 25, 2021, 5:05 AM IST

Updated : Mar 25, 2021, 6:23 AM IST

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ.. వైరస్​ మార్పులు ఆందోళనకరంగా ఉన్నట్టు తాజాగా వెల్లడైంది! దిల్లీ, మహారాష్ట్రల్లో రెండు సార్లు ఉత్పరివర్తనం చెందిన(డబుల్​ మ్యూటెంట్​ వేరియంట్​) కొవిడ్​ వైరస్​ తాజాగా వెలుగుచూసింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది.

బ్రిటన్​, బ్రెజిల్​, దక్షిణాఫ్రికాల్లో కలకలం సృష్టించిన ఈ వైరస్​లు.. మన దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాప్తి చెందుతున్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం పాజిటివ్​ కేసులు పెరుగుతుండటానికి ఈ వైరస్​లే కారణమా? కాదా? అనేది కచ్చితంగా చెప్పలేమంది. అయితే.. వీటి జన్యుక్రమం, ఉత్పరివర్తనాలు, వ్యాప్తిపై 'ఇండియన్​ సార్స్​ కొవ్​-2 కన్సార్టియం ఆన్​ జీనోమిక్స్​(ఇన్సాకాగ్​)' అధ్యయనం సాగిస్తున్నట్టు తెలిపింది. 10 జాతీయ స్థాయి ప్రయోగశాలలు కలిసి గత డిసెంబర్​ 25న ఇన్సాకాగ్​ ఏర్పడింది.

ఇదీ చదవండి: 'మృతులలో 88 శాతం మంది వారే'

ఆ మూడు రకాల వైరస్​లూ..

"విదేశాల నుంచి భారత్​కు వచ్చినవారికి, వారి ద్వారా మహమ్మారి సోకిన వారికి ఇన్సాకాగ్​ పరీక్షలు చేసింది. మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 10,787 నమూనాలను సేకరించి వైరస్​ జన్యుక్రమాన్ని విశ్లేషించింది. వీటిలోని 771 కేసుల్లో వైరస్​ మార్పులు వైవిధ్యంగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా 736 కేసులకు బ్రిటన్​ వైరస్​; 34 కేసులకు దక్షిణాఫ్రికా రకం; ఒక్క కేసుకు బ్రెజిల్ వైరస్​ కారణమని నిర్ధరణ అయింది. రెండుసార్లు మార్పులకు లోనైన ఆందోళనకర కరోనా వైరస్​(వీఓసీ).. దిల్లీ, మహారాష్ట్రల్లో వెలుగు చూడటం గమనార్హం. దేశంలో సుమారు 70 జిల్లాలకు కరోనా కొత్త రకాలు విస్తరించాయి." అని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం డైరెక్టర్​ ఎస్​కే సింగ్​ తెలిపారు.

ఇదీ చదవండి: 'ఆ వ్యాధుల నివారణలో ముందున్న భారత్'

రోగ నిరోధక వ్యవస్థకు చిక్కకుండా..

గతేడాది డిసెంబర్​తో పోల్చితే..'ఈ484క్యూ', 'ఎల్​452ఆర్​' ఉత్పరివర్తనాల వేగం పెరిగింది. ఈ మార్పులకు లోనైన వైరస్​లు రోగ నిరోధక వ్యవస్థకు చిక్కకుండా, మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నాయి. మొత్తం నమూనాల్లో ఇలాంటివి 15 నుంచి 20 శాతం వరకూ ఉంటాయని ఆరోగ్య శాఖ అంచనా వేసింది.

ఇదీ చదవండి: 'మహా' కరోనా కేసుల్లో సరికొత్త రికార్డు

'ఎన్​440కె'పైనే గురి..

కేరళలోని 14జిల్లాల నుంచి సేకరించిన 2,032 నమూనాల జన్యుక్రమాన్ని ఇన్సాకాగ్​ విశ్లేషించగా.. 123 శాంపిళ్లలో 'ఎన్​440కే' రకం వైరస్​ కనిపించింది. రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం దీని ప్రత్యేకత. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్​ నుంచి సేకరించిన నమూనాల్లో సుమారు 33 శాతం, తెలంగాణ నుంచి సేకరించిన వాటిల్లో సుమారు 50శాతం ఈ రకమే కనిపించింది. బ్రిటన్​, డెన్మార్క్​, సింగపూర్​, జపాన్​, ఆస్ట్రేలియాల్లో గతంలోనే దీన్ని గుర్తించారు.

ఇదీ చదవండి: పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం లేఖ

Last Updated : Mar 25, 2021, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.