నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ 2020లో భాగంగా.. 13 పురస్కారాలను సొంతం చేసుకుంది భారతీయ రైల్వే. వివిధ విభాగాలకు ఈ అవార్డులు వచ్చినట్టు రైల్వే వెల్లడించింది.
"స్వచ్ఛమైన, పర్యావరణహిత రవాణాను అందించేందుకు రైల్వే చేస్తున్న నిర్విరామ కృషి ఫలితమే ఈ అవార్డులు. రవాణా విభాగంలో పశ్చిమ రైల్వేకు మొదటి స్థానం, తూర్పు రైల్వేకు రెండవ స్థానం దక్కాయి. ఈశాన్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వేలకు మెరిట్ సర్టిఫికెట్లు అందాయి."
-భారతీయ రైల్వే.
ఇతర విభాగాల్లో..
భవనాల విభాగంలో భావ్నగర్, రాజకోట్లోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాలు తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఈశాన్య రైల్వే పరిధిలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలోని విద్యుత్ విభాగానికి మెరిట్ సర్టిఫికెట్ దక్కింది.
ఇదీ చదవండి : 'టీకాల కోసం ప్రభుత్వం ఆర్డర్- ఒక్కోటి రూ.210'