Indian Overseas Bank Notification 2023 : బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునే వారికి శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (IOB)లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నై ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న ఈ బ్యాంకులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది ఐఓబీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులు..
IOB Job Vacancy 2023 : 66 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
విద్యార్హతలు..
IOB Jobs Qualification : ఏదైనా డిగ్రీ, లా, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఆర్క్, సీఏ, ఎంసీఎ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీడీబీఎం, సీబీసీఏ, సీఏలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం..
IOB Jobs Experience : సంబంధిత విభాగాల్లో కొంత కాలం పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయో పరిమితి(IOB Jobs Age Limit)..
- ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంబంధిత వర్గాల అభ్యర్థులకు వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి.
వేతనం(IOB Jobs Salary)..
- పోస్టులను అనుసరించి కనిష్ఠంగా రూ.48,000 నుంచి గరిష్ఠంగా రూ.89,000 వరకు ప్రతినెలా జీతం చెల్లిస్తారు.
- ఉద్యోగంలో చేరిన రోజు నుంచి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
దరఖాస్తు రుసుము(IOB Jobs Application Fees)..
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంటిమేషన్ ఛార్జీల కింద రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.
- ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.850 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.
ఎంపిక విధానం..
IOB Jobs Selection Process : ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జాబ్ లొకేషన్..
IOB Job Location : ఉద్యోగానికి ఎంపికైన వారికి దేశంలోని ఐఓబీ బ్యాంకు శాఖల్లో పోస్టింగ్ కల్పిస్తారు.
అధికారిక వెబ్సైట్..
IOB Official Website : వయోపరిమితి సడలింపులు, పరీక్షా తేదీ, ఎగ్జామ్ సిలబస్ తదితర వివరాల కోసం IOB అధికారిక వెబ్సైట్ https://www.iob.in/Careersను సందర్శించవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ..
IOB Apply Last Date : 2023 నవంబర్ 19
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగం..
Repco Bank Jobs 2023 : చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ రెప్కో బ్యాంక్లో ఖాళీగా ఉన్న 12 మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2023 నవంబర్ 20 వరకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ చిరునామా, విద్యార్హతలు, వేతనాలు సహా తదితర పూర్తి వివరాల కోసం బ్యాంక్ అధికారిక వెబ్సైట్ https://www.repcobank.comను వీక్షించవచ్చు.
స్పోర్ట్స్ కోటాతో తపాలా శాఖలో ఉద్యోగాలు- రూ80 వేల జీతం! అర్హతలు ఏంటంటే?
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు, రూ.2లక్షల వరకూ జీతం!- దరఖాస్తు చేయండిలా
ఏవియేషన్ రంగంలో జాబ్ చేస్తారా? రూ,లక్షా40వేల జీతంతో ఉద్యోగాలు- దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!