భారత నావికాదళానికి చెందిన ఐదో స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్ వాగిర్ జలప్రవేశం చేసింది. దక్షిణ ముంబయిలోని మజ్‌గావ్ డాక్‌లో వాగిర్ జలాంతర్గామిని లాంఛనంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ సతీమణి విజయ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్‌మెరైన్‌ను సముద్రంలోకి ప్రవేశపెట్టారు.
ఈ జలాంతర్గాములకు ఫ్రెంచ్ నావికాదళ రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్ఎస్ రూపకల్పన చేయగా.. భారత నావికాదళ ప్రాజెక్ట్-75లో భాగంగా రూపొందిస్తున్నారు. వాగిర్ సబ్‌మెరైన్‌ను ఇతర దేశాల క్షిపణులు, సబ్‌మెరైన్‌లు కనిపెట్టలేని స్టెల్త్ సామర్థ్యంతో రూపొందించారు. దీనితో పాటు అధునాతన శబ్దశోషణ సాంకేతికతను ఏర్పాటు చేశారు. ఈ జలాంతర్గాములు యాంటీ సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, కీలక సమాచార సేకరణ, తీరప్రాంత గస్తీ తదితర కార్యకలాపాల్లో ఉపయోగపడతాయి.