ETV Bharat / bharat

సరిహద్దులు దాటిన మరో 'పెళ్లి' కథ.. ఆన్​లైన్​లో రాజస్థాన్​ యువకుడు- పాక్​ యువతి వివాహం

Indian Groom Pakistani Bride : మెున్న సీమా హైదర్‌.. నిన్న అంజూ.. ఇవాళ అమీనా.. ఇలా రోజురోజుకు పాకిస్థాన్‌, భారత్‌ దేశాలకు చెందిన ఒకరిని ఒకరు వివాహాలు చేసుకొనే యువత సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా పాక్‌ చెందిన అమీనా అనే యువతి.. రాజస్థాన్‌ యువకుడిని వివాహాం చేసుకుంది. కానీ వీరి వివాహాం వర్చువల్‌గా జరిగింది.

indian groom pakistani bride
indian groom pakistani bride
author img

By

Published : Aug 6, 2023, 5:15 PM IST

Updated : Aug 6, 2023, 10:30 PM IST

సరిహద్దులు దాటిన మరో 'పెళ్లి' కథ.. ఆన్​లైన్​లో రాజస్థాన్​ యువకుడు- పాక్​ యువతి వివాహం

Indian Groom Pakistani Bride : సీమా హైదర్‌, అంజూ బాటలో ఇప్పుడు మరో ప్రేమ కథ సరిహద్దులు దాటింది. పాకిస్థాన్‌కు చెందిన అమీనా.. రాజస్థాన్‌కు చెందిన అర్బాజ్‌ను పెళ్లాడింది.అయితే వీరి వివాహంలో అక్రమంగా సరిహద్దులు దాటడం వంటి సాహసాలు లేవు. పెద్దల అంగీకారంతోనే వీరిద్దరు ఒకటయ్యారు. కానీ వీరి వివాహాం అందరిలా సాధారణంగా జరగలేదు. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు.

indian groom pakistani bride
వివాహ వేడుకలో అర్బాజ్​తో బంధువులు

వీసా దొరక్కపోవడం వల్ల..
Indian Man Online Wedding Pakisthan Woman : జోధ్‌పుర్‌కు చెందిన అర్బాజ్‌ ఖాన్‌ కుటుంబంతో పాకిస్థాన్‌ కరాచీకు చెందిన అమీనా కుటుంబానికి బంధుత్వం ఉంది. దీంతో అర్బాజ్‌కు అమీనాతో వివాహాం చేయాలని పెద్దలు నిశ్చయించుకున్నారు. పెళ్లి ముహుర్తం కూడా ఖరారు చేసుకున్నారు.పెళ్లి కోసం అమీనా.. వీసా దరఖాస్తు చేసుకుంది. కానీ చివరి నిమిషంలో వీసా దొరకకపోవడం వల్ల అమీనా పాక్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో అర్బాజ్‌- అమీనా.. వర్చువల్‌గా వివాహం చేసుకున్నారు. అమీనాకు వీసా దొరకలేదని.. మళ్లీ వీసాకు దరఖాస్తు చేశామని, త్వరలోనే అమీనా భారత్‌కు వస్తుందని అర్బాజ్‌ చెబుతున్నాడు.

indian groom pakistani bride
అర్బాజ్​ వివాహ వేడుక దృశ్యాలు

"పాకిస్థాన్‌లో మాకు బంధువులు ఉన్నారు. మాది పెద్దలు కుదిర్చిన వివాహాం. మా తల్లిదండ్రులు, బంధువులు అమీనాతో నా పెళ్లి చేయాలని నిశ్చయించారు. వీసా దొరకడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకే ఆన్‌లైన్‌లో వివాహం చేసుకున్నాం. వీసా దొరికాక తను ఇండియా వస్తుంది. అప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంటాను."
-అర్బాజ్‌, పెళ్లి కుమారుడు

ఎల్​ఈడీ తెరపై ఆన్​లైన్​లో..
Online Wedding Indian Man Pak Woman : పెళ్లి కుమారుడు అర్బాజ్‌.. ఓ ప్రముఖ సంస్థలో ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వైభవంగా అర్బాజ‌్, అమీనాల వివాహాం జరిగింది. అర్బాజ్ ఊరేగింపుగా జోధ్‌పుర్‌లోని ఓస్వాల్ సమాజ్ భవన్‌కు చేరుకున్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన.. పెద్ద ఎల్‌ఈడీ తెరపై దృశ్యాలు కనిపిస్తుండగా ఆన్‌లైన్‌లో అమీనాను పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో వర్చువల్‌గా వీరిద్దరు ఒకటయ్యారు. ఇంతకుముందు కూడా తమ కుటుంబంలో ఓ వ్యక్తి పాక్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడని అర్బాజ్‌ తండ్రి చెబుతున్నాడు.

ఫేస్‌బుక్‌ లవ్​.. ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన భారత మహిళ

మతం మార్చుకుని పాక్‌ ప్రియుడితో పెళ్లి.. ఫాతిమాగా పేరు మార్చుకుని అంజూ వివాహం

Last Updated : Aug 6, 2023, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.