ETV Bharat / bharat

సాహో సైనికా- అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశం కోసం..

Indian Army Soldiers Snow: దేశ సరిహద్దుల్లో అత్యంత ప్రతికూల వాతావ‌ర‌ణంలోనూ సైనికులు క‌నురెప్ప వాల్చకుండా ప‌హారా కాస్తున్నారు. చ‌లిపులిలోనే కాదు భారీ హిమపాతంలోనూ దేశ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. 17వేల అడుగుల ఎత్తులో మంచుకొండలపై మొక్కవోని ధైర్యంతో భరతమాత సేవలో తరిస్తున్నారు.

indian army snow
ప్రాణాలను లెక్కచేయకుండా జవాన్ల గస్తీ
author img

By

Published : Jan 8, 2022, 8:18 PM IST

ప్రాణాలను లెక్కచేయకుండా జవాన్ల గస్తీ

Indian Army Soldiers Snow: జ‌మ్ముక‌శ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. అయినా భారత సేనలు దేశ రక్షణ కోసం సరిహద్దుల వెంట గ‌స్తీ నిర్వహిస్తున్నాయి. సముద్ర మట్టానికి 17వేల అడుగుల ఎత్తున ఉన్న కుప్వారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ మంచు ఖండాన్ని తలపిస్తోంది. పెద్దఎత్తున మంచు కురుస్తున్నా వీర సైనికులు ప్రాణాలను లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు.

indian army snow
హిమపాతంలో కూడా కాపలా కాస్తున్న జవాను
indian army snow
సరిహద్దులో గస్తీ కాస్తున్న జవాన్లు

కేర‌న్ సెక్టార్‌లోనూ భారీగా మంచు కురుస్తోంది. సైనికులు ఎప్పటిలాగే పహారా కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో కాలు తీసి కాలు పెట్టే పరిస్థితి లేదు. అయినా స్నోస్కూట‌ర్లపై గస్తీ నిర్వహిస్తున్నారు. సరిహద్దు సమీప ప్రాంతాల్లో కంటి రెప్ప వాల్చకుండా శ‌త్రుమూకల క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టారు.

భారీగా మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ఉండటమే పెద్ద ప్రమాదమైతే భారీ ఆయుధ సామగ్రితో సైన్యం పహారా కాస్తోంది. అలాంటి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ వీర సైనికులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా భరతమాత సేవలో తరిస్తున్నారు. ప్రాణం కంటే దేశం మిన్న అంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

indian army snow
సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద జవాన్లు

ఇదీ చూడండి : Act of God: 'అగ్నిప్రమాదాలను దేవుడి చర్యగా పరిగణించలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.