Indian Army Recruitment 2023 : ఇండియన్ ఆర్మీలో పని చేయాలని ఆశించే ఇంటర్మీడియట్ లేదా 10+2 పూర్తిచేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. తాజాగా ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ -51లో పర్మనెంట్ కమిషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 12లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ.. ఇండియన్ ఆర్మీ(Indian Army) రిలీజ్ చేసిన ఈ కొత్త రిక్రూట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? అర్హతలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ -51లో పర్మనెంట్ కమిషన్ స్థానం కోసం.. అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది. 90 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
వయోపరిమితి : ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా వయో పరిమితి 16 1/2 సంవత్సరాల నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హతలు : ఈ ప్రవేశానికి అర్హత పొందేందుకు అభ్యర్థులు 10+2 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో కనీసం 60% మార్కులతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వివిధ రాష్ట్ర/కేంద్ర బోర్డుల PCM శాతాన్ని గణించడానికి అర్హత అవసరం కేవలం XII తరగతి మార్కులపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థి తప్పనిసరిగా JEE (మెయిన్స్) 2023 పాసై ఉండాలి.
శిక్షణ - వేతనాలు : ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2023 పర్మనెంట్ కమిషన్ భర్తీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుదారు 04 సంవత్సరాల శిక్షణా కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటుంది. శిక్షణ వ్యవధిలో దరఖాస్తుదారునికి రూ.13,940 చెల్లించబడుతుంది. శిక్షణ పూర్తయిన తర్వాత నెలవారీ జీతం రూ. 2,50,000 అందుతుంది.
ఎంపిక విధానం (Indian Army Permanent Commission Process) :
SSB అనేది ప్రయాగ్‌రాజ్ (UP), భోపాల్ (MP), బెంగళూరు (కర్ణాటక) లేదా జలంధర్ (పంజాబ్) వంటి సెలక్షన్ కేంద్రాల్లో.. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఫిబ్రవరి/మార్చిలో ఉండే అవకాశం ఉంది.
How to Apply Indian Army Recruitment 2023 in Telugu :
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ ప్రకారం.. అర్హతగల దరఖాస్తుదారులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత రిక్రూట్మెంట్కు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అయితే.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గడువులోగా లేదా ముందుగా దరఖాస్తును సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 12, 2023.