ETV Bharat / bharat

పాక్ ఉగ్ర చర్యలపై విదేశీ రాయబారుల ఆరా - JK latest

కశ్మీర్​లో ఆర్టికల్​-370 రద్దు అనంతర పరిస్థితులను తెలుసుకునేందుకు.. 24 దేశాలకు చెందిన రాయబారుల బృందం అక్కడ పర్యటించింది. సరిహద్దులో పాక్​ పాల్పడుతున్న ఉగ్ర కుట్రలపై గురువారం ఆరా తీశారు అధికారులు.

Indian army briefs foreign envoys visiting J-K on role of Pak in running terror factories across LoC
కశ్మీర్​లో పాక్ ఉగ్ర చర్యలపై విదేశీ రాయబారుల ఆరా!
author img

By

Published : Feb 18, 2021, 3:19 PM IST

కశ్మీర్​లో పాక్​ ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ఘటనలపై 24 దేశాల రాయబారుల బృందం ఆరా తీసింది. ఈ మేరకు నియంత్రణ రేఖ వెంబడి శిక్షణా శిబిరాలను నిర్వహించడం సహా.. సరిహద్దుల్లో ఉగ్రవాద కర్మాగారాలను నడపడంలో దాయాది దేశం పాత్రలను సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. పాక్​ చొరబాటు యత్నాలు, వారు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద రహస్య స్థావరాలు, డ్రోన్​లను ఉపయోగించడం వంటి వాటి గురించి యూరోపియన్​ యూనియన్​(ఈయూ), బ్రెజిల్, మలేసియా సభ్య దేశాల రాయబారులకు వివరించింది భారత సైన్యం.

కశ్మీర్​లోని సాంబా సెక్టార్​లో సొరంగాలను ఏర్పాటు చేసుకోవడాన్ని గురించి రాయబార బృందంతో ప్రధానంగా చర్చించారు సైనికులు. చొరబాటు యత్నాల్లో భాగంగా.. నియంత్రణ రేఖ వెంబడి వారు ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గాలను గుర్తించినట్టు వివరించారు.

అంతేకాకుండా.. 2019లో కశ్మీర్​లో ఆర్టికల్​-370 రద్దు అనంతరం పరిస్థితులు చక్కబడినట్టు స్పష్టం చేశాయి సైనిక బలగాలు. ఈ చర్యవల్ల స్థానికంగా ఉగ్రవాదం చాలా వరకు తగ్గిందని పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: ఉగ్రస్థావరం గుట్టురట్టు- భారీగా ఆయుధాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.