భారత్ ఎప్పుడూ అఫ్గాన్ ప్రజల పక్షాన నిలబడుతుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి హనిఫ్ ఆత్మర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. అఫ్గాన్ నుంచి దళాల పూర్తి ఉపసంహరణపై అమెరికా ప్రకటన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అఫ్గాన్ శాంతి ప్రక్రియలో పొరుగుదేశాల పాత్ర చర్చకు వచ్చినట్లు జైశంకర్ తెలిపారు.
-
Good conversation with FM @MHaneefAtmar of Afghanistan on recent developments. Discussed the role of neighbours in the Afghan peace process. As always, India will stand with the people of Afghanistan.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Good conversation with FM @MHaneefAtmar of Afghanistan on recent developments. Discussed the role of neighbours in the Afghan peace process. As always, India will stand with the people of Afghanistan.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 17, 2021Good conversation with FM @MHaneefAtmar of Afghanistan on recent developments. Discussed the role of neighbours in the Afghan peace process. As always, India will stand with the people of Afghanistan.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 17, 2021
"ప్రస్తుత పరిణామాలపై అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రితో మంచి సంభాషణ జరిగింది. అఫ్గాన్ శాంతి ప్రక్రియలో పొరుగుదేశాల పాత్ర గురించి చర్చించాం. ఎప్పటిలాగే, అఫ్గానిస్థాన్ ప్రజల పక్షాన భారత్ నిలబడుతూనే ఉంటుంది."
-జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
అఫ్గాన్‌లో శాంతి స్థాపనకు భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. అఫ్గాన్ పునర్నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లను వెచ్చించింది. తాలిబన్లతో చర్చలు అఫ్గాన్ ఆధ్వర్యంలోనే జరగాలని ఆశిస్తోంది.
ఇదీ చూడండి: ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, టీకా కొరతపై రాష్ట్రాల ఫిర్యాదు!