ETV Bharat / bharat

త్వరలో భారత అమ్ముల పొదిలోకి మరో క్షిపణి! - indian army artillary

అస్త్ర మార్క్​- 2 క్షిపణి ప్రయోగానికి భారత్ సిద్ధమవుతోంది. 160 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన ఈ క్షిపణి ప్రయోగాన్ని ఈ ఏడాది రెండో అర్ధభాగంలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

missile, astra missile, testing
భారత్​ అమ్ములపొదిలోకి త్వరలో మరో మిసైల్
author img

By

Published : Feb 15, 2021, 8:37 PM IST

చైనా, పాకిస్థాన్​లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు తన ఆయుధ సంపత్తిని మెరుగుపరుచుకుంటున్న భారత్​.. మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. బియాండ్​ విజువల్​ రేంజ్​ ఎయిర్ టు మిసైల్(బీవీఆర్​ఏఏఎం)​ రకానికి చెందిన 'అస్త్ర' మార్క్-​2 క్షిపణిని ఈ ఏడాది రెండో అర్ధభాగంలో పరీక్షించనుంది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. 2022 నాటికి క్షిపణి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

ఏంటీ అస్త్ర మిసైల్​?

రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్​ తయారు చేసిన బీవీఆర్​ఏఏఎం క్షిపణులనే భారత్ ఎక్కువగా ఉపయోగిస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా 'అస్త్ర' క్షిపణులను డీఆర్​డీఓ అభివృద్ధి చేసింది. ఇప్పటికే సుఖోయ్ యుద్ధ విమానం సాయంతో అస్త్ర మార్క్​ 1ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణిని తేజస్​ యుద్ధవిమానానికి అనుసంధానించాలని యత్నిస్తోంది.

శబ్ద తరంగాలకు 4 రెట్ల వేగంతో అస్త్ర క్షిపణి ప్రయాణిస్తుంది. మార్క్-2 క్షిపణి సామర్థ్యం మార్క్​ 1తో పోలిస్తే ఎక్కువ. 160 కిలోమీటర్ల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేలా శాస్త్రవేత్తలు దీనిని రూపొందిస్తున్నారు.

ఇదీ చదవండి : సైన్యం చేతికి అర్జున్‌ మార్క్‌-1ఏ యుద్ధ ట్యాంక్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.