దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కొరతను అధిగమించే అంశంపై కేంద్రం దృష్టిసారించింది. ఈ క్రమంలోనే 50,000 మెట్రిక్ టన్నుల(ఎమ్టీ) మెడికల్ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయా దేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతికి అవకాశం ఉన్న వనరులను అన్వేషిస్తోంది.
100 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు..
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతోన్న వేళ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతోన్న 12 రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఆక్సిజన్ కావాల్సి ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 162 ఆక్సిజన్ తయారీ(ప్రెజర్ స్వింగ్) ప్లాంట్లు ఏర్పాటు చేస్తోన్న కేంద్రం.. మరో 100 ప్లాంట్లను నెలకొల్పేందుకు ఆసుపత్రులను గుర్తిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
పీఎమ్-కేర్స్ ఫండ్ కింద ఆసుపత్రులు తమ సొంత ఆక్సిజన్ ప్లాంట్ కలిగి ఉండేలా చూసేందుకు కేంద్రం కృషి చేస్తోంది.
ఇవీ చదవండి: కరోనా విలయం.. ఆ రాష్ట్రాల్లో దయనీయ ఘటనలు