జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు (G20 Summit) భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2023లో జీ20 సదస్సు (G20 Summit 2023).. భారత్ వేదికగా జరగనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్‌లో జీ20 సదస్సు జరగడం ఇదే తొలిసారి. ఈ సదస్సు నిర్వహణ బాధ్యతలు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించింది. 'భారత్.. డిసెంబరు 1, 2022 నుంచి జీ20 సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. 2023లో సదస్సును నిర్వహిస్తారు' అని పేర్కొంది.
ఈ సదస్సులో (G20 Summit) మొత్తం 19 దేశాలు పాల్గొంటాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి.
ఈ ఏడాది జీ20 సదస్సుకు ఇటలీ ఆతిథ్యం ఇస్తోంది. ఇది అక్టోబరు 30, 31 తేదీల్లో జరగనుంది.
ఇదీ చూడండి : 'జాతీయ క్రీడగా హాకీ' పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం