Pralay missile: 'ప్రళయ్' బాలిస్టిక్ క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలేశ్వర్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి బుధవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఈ క్షిపణి ప్రయోగం జరిపింది. ఈ స్వల్ప శ్రేణి మిస్సైల్ నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేరుకుందని డీఆర్డీఓ ప్రకటించింది. తీరం వెంబడి క్షిపణి ప్రయాణించిన మార్గాన్ని పలు పరికరాల సాయంతో పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు.
ప్రళయ్‌ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధి చేసింది. పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా రూపొందించింది.
ప్రళయ్ పేలోడ్ సామర్థ్యం 500 నుంచి 1,000 కిలోలు. 350-500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఇదీ చూడండి: కుక్క మరణంపై న్యాయపోరాటం- 9 ఏళ్లకు పరిహారం