ETV Bharat / bharat

'అగ్ని-3' క్షిపణి ప్రయోగం విజయవంతం

భారతదేశం అగ్ని-3 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని అబ్దుల్​ కలాం ద్వీపం నుంచి ఈ మధ్యంతర ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.

India carries successful training launch of Agni-3 missile
అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతం
author img

By

Published : Nov 23, 2022, 10:49 PM IST

Updated : Nov 23, 2022, 11:02 PM IST

ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్​ కలాం ద్వీపం నుంచి.. అగ్ని-3 మధ్యంతర శ్రేణి క్షిపణి పరీక్షను భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని డీఆర్​డీఓ వర్గాలు తెలిపాయి. సాధారణ సైనిక శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్ష విజయవంతంగా ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ముందుగా నిర్దేశించిన లక్ష్యాలను ఈ క్షిపణి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ అగ్ని-3 క్షిపణి శ్రేణిలో ఇంతకుముందు 2006 జూన్​ 9న మొదటిసారిగా దీన్ని ప్రయోగించగా విఫలమైంది. ఈ క్షిపణి అణు వార్​హెడ్​ తీసుకెళ్లి.. 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. రెండవ క్షిపణిని 2007లో విజయవంతంగా ప్రయోగించారు. 2008లో వరుసగా మూడోసారి ప్రయోగించారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన విజయవంతమైన క్షిపణి.

Last Updated : Nov 23, 2022, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.