ETV Bharat / bharat

India Smart Cities Conclave 2023 : బెస్ట్ స్మార్ట్ సిటీగా ఇందౌర్​.. సూరత్​కు రెండో స్థానం - ఇండియా బెస్ట్ స్మార్ట్ స్టేట్​

India Smart Cities Conclave 2023 : దేశంలో ఉత్తమ​ స్మార్ట్ సిటీగా ఎంపికైంది మధ్యప్రదేశ్​లోని ఇందౌర్ నగరం. ఇండియా స్మార్ట్ సిటీస్​ మిషన్​ 2023లో భాగంగా ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం.

India Smart Cities Conclave 2023
India Smart Cities Conclave 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 3:01 PM IST

Updated : Sep 27, 2023, 3:48 PM IST

India Smart Cities Conclave 2023 : మధ్యప్రదేశ్​లోని ఇందౌర్​ భారత్​లో ఉత్తమ స్మార్ట్ సిటీగా ఎంపికైంది. గుజరాత్​లోని సూరత్​ రెండో స్థానం.. ఆగ్రా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియా స్మార్ట్ సిటీస్​ మిషన్​​ 2023లో భాగంగా బుధవారం ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మధ్యప్రదేశ్​ తొలి స్థానాన్ని సంపాదించుకుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా.. ఈ అవార్డును అందుకున్నారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్​.

  • India Smart Cities Conclave 2023 | Indore wins the Best Smart City award in the country. Surat, Gujarat awarded second place and Agra secured third spot in the country. Madhya Pradesh was also awarded as the number one state in the country

    (Photo source: Union Minister Hardeep… pic.twitter.com/xIBoMxzW55

    — ANI (@ANI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Best Smart City In India : ఇందౌర్​లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము.. ఓ అంచనా ప్రకారం 2047 నాటికి దేశంలో 50 శాతానికిపైగా జనాభా కేవలం పట్టణాల్లోనే నివసిస్తారన్నారు. ఆ సమయానికి దేశ జీడీపీలో 80 శాతానికి పైగా నగరాల నుంచే వస్తుందని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరాల అభివృద్ధికి రోడ్ మ్యాప్​ను రూపొందించాలని ఆమె సూచించారు. వాతావరణ మార్పులు సహా పునరుత్పాదక ఇంధనంపైనా దృష్టి సారించాలని చెప్పారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన పరిసరాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నగరాల్లో డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలను నివారించడానికి ప్రజల సహాకారం తప్పనిసరి అని ఆమె గుర్తు చేశారు.

India Smart City Mission : స్మార్ట్ సిటీస్ మిషన్​లో భాగంగా రూ. 171,044 కోట్ల విలువైన 7,934 ప్రాజెక్టులను చేపట్టామని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి హర్​దీప్ సింగ్ పూరి చెప్పారు. ఇందులో రూ. 1,10,794 విలువైన 6,069 ప్రాజెక్టులు పూర్తి చేశామని.. రూ.60,250 విలువైన 1,865 పనులు జూన్​ 2024 లోగా పూర్తవుతాయన్నారు. దాదాపు రూ.25 వేల కోట్ల విలువైన పబ్లిక్ ప్రైవేట్​ భాగస్వామ్య పనులు జరిగాయని వివరించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. పౌరుల కేంద్రంగా మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ మిషన్​ను చేపట్టామని చెప్పారు. కరోనా లాంటి మహమ్మారి సమయంలోనూ.. ఈ మిషన్​కు నిధులు కేటాయించామన్నారు. 2018లో రూ.వెయ్యి కోట్లు కేటాయించగా.. తాజాగా ఆ సంఖ్య రూ. 1,10,000 కోట్లకు చేరిందని తెలిపారు.

ఆరోసారి బెస్ట్​ క్లీన్​ సిటీగా ఇందోర్.. టాప్​-3 నుంచి విజయవాడ మిస్

Awards: ఇండియా స్మార్ట్ సిటీ కంటెస్ట్-2020..తిరుపతికి 5 పురస్కారాలు

Last Updated : Sep 27, 2023, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.