భారత్, సింగపూర్, ధాయ్‌లాండ్ నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న 'సిట్మెక్స్' రెండో ఎడిషన్ విన్యాసాలు అండమాన్ సముద్రంలో కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు అధికారులు. 'సిట్మెక్స్ 2020' పేరిట జరుగుతున్న ఈ విన్యాసాలు.. కరోనా కారణంగా నాన్ కాంటాక్ట్, ఎట్ సీ ఓన్లీ ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.
-
#WATCH: The second edition of trilateral maritime exercise between the navies of India, Singapore and Thailand SITMEX-2020 commenced in the Andaman Sea yesterday. The two-day long exercise is scheduled in a ‘non-contact, at sea only format’, in view of COVID-19 restrictions. pic.twitter.com/VajPiakwvi
— ANI (@ANI) November 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: The second edition of trilateral maritime exercise between the navies of India, Singapore and Thailand SITMEX-2020 commenced in the Andaman Sea yesterday. The two-day long exercise is scheduled in a ‘non-contact, at sea only format’, in view of COVID-19 restrictions. pic.twitter.com/VajPiakwvi
— ANI (@ANI) November 21, 2020#WATCH: The second edition of trilateral maritime exercise between the navies of India, Singapore and Thailand SITMEX-2020 commenced in the Andaman Sea yesterday. The two-day long exercise is scheduled in a ‘non-contact, at sea only format’, in view of COVID-19 restrictions. pic.twitter.com/VajPiakwvi
— ANI (@ANI) November 21, 2020
భారత్ నుంచి రెండు నౌకలు
మూడు నౌకాదళాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం, అంతర్జాతీయ జలాల్లో శాంతి పరిరక్షణ సహా బహుముఖ ఆపరేషన్ల సామర్థ్యం పెంచుకునేందుకు ఈ విన్యాసాలు ఉపకరించనున్నాయి. సముద్రం మీద యుద్ధం, ఉపరితలం నుంచి గగనతలంపై ఉన్నలక్ష్యాలను ఛేదించడం, నావికుల సామర్థ్య పెంపుదల, సమన్వయంగా విన్యాసాల నిర్వహణ ఇందులో భాగం కానున్నాయి. భారత నౌకాదళం నుంచి కమోర్టా, కార్ముఖ్ అనే రెండు యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. సింగపూర్ నేవీ నుంచి ఇట్రపిడ్, ఎండీవర్లు.. ధాయ్‌లాండ్ నుంచి క్రబూరి నౌకలు తమ సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి.
ఎందుకంటే.?
2018లో భారత ప్రధాని సింగపూర్, ధాయ్ పర్యటనల సందర్భంగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల మధ్య సిట్మెక్స్ పేరిట ఏటా ఈ విన్యాసాలు చేపడుతున్నారు. మూడు దేశాల మధ్య మిలటరీ బంధాలను పటిష్ఠం చేసుకునేందుకూ ఇది సహకరిస్తోంది.
ఇదీ చదవండి: టీకా పంపిణీ కోసం అందుబాటులోకి కొవిన్ యాప్