ETV Bharat / bharat

శ్రీలంక, బహ్రెయిన్​లకు కొవిషీల్డ్​ టీకా డోసులు - బహ్రెయిన్​కు కరోనా టీకా

శ్రీలంక, బహ్రెయిన్ దేశాలకు ఉచిత కొవిడ్​ టీకాలను భారత్​ గురువారం పంపించింది. టీకాలు అందిన వెంటనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు ఇరు దేశాలు కసరత్తు చేస్తున్నాయి. త్వరలోనే దక్షిణాఫ్రికాకు కూడా టీకాలు అందించనుంది.

srilanka, covisheild
శ్రీలంకకు కొవిషీల్డ్​ టీకాలు
author img

By

Published : Jan 28, 2021, 11:46 AM IST

Updated : Jan 28, 2021, 12:35 PM IST

కరోనాపై పోరులో విదేశాలకు టీకాలను అందిస్తూ అండగా నిలుస్తోంది భారత్‌. టీకా సాయంలో భాగంగా బహ్రెయిన్‌, శ్రీలంక దేశాలకు గురువారం టీకాలను పంపించింది. కొవిషీల్డ్‌ టీకాను తయారీ చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్​ ఇండియా.. ముంబయి విమానాశ్రయం నుంచి ఈ టీకాలను పంపింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్​లు శ్రీలంక చేరుకున్నాయని వెల్లడించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. 2-8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య టీకాలను ప్యాకింగ్ చేసి పంపారు.

vaccie, srilanka, tika
ముంబయి విమానాశ్రయంలో..
vaccie, srilanka, tika
శ్రీలంకకు చేరుకున్న టీకాలు

భారత్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు 5 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. భారత్‌ నుంచి టీకాలు అందిన వెంటనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు శ్రీలంక, బహ్రెయిన్‌ దేశాలు కసరత్తు చేస్తున్నాయి.

సరిహద్దు మిత్ర దేశాలైన భూటాన్, నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు భారత్‌ ఇప్పటికే ఉచితంగా టీకాలు అందించింది.

దక్షిణాఫ్రికాకు కూడా..

10 లక్షల టీకా డోసులను..​ దక్షిణాఫ్రికాకు అందించనుంది భారత్​. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ జ్వెలీ మెఖైజ్ బుధవారం తెలిపారు. భారత్ నుంచి ఫిబ్రవరి 1 నాటికి 10 లక్షల డోసులు దక్షిణాఫ్రికా చేరుకుంటాయన్నారు. టీకాలు వచ్చిన 14 రోజులకు పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. తొలి దశలో వ్యాక్సిన్​ను ఆరోగ్య కార్యకర్తలకు అందించనున్నారు.

ఇదీ చదవండి : భారత్​ చేరుకున్న మూడు రఫేల్​ జెట్లు

Last Updated : Jan 28, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.