భారత్‌లో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య (Coronavirus update) భారీగా తగ్గింది. 201రోజుల తర్వాత 20 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,795 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus India) నిర్ధరణ అయింది. ఒక్కరోజే 26,030 మంది కొవిడ్ (Corona update) నుంచి కోలుకున్నారు. మరో 179 మంది చనిపోయారు.
- మొత్తం కేసులు: 3,36,97,581
- మొత్తం మరణాలు: 4,47,373
- మొత్తం కోలుకున్నవారు: 3,29,58,002
- యాక్టివ్ కేసులు: 2,92,206
కేరళలో కరోనా కేసులు(Kerala Corona Update) స్థిరంగా తగ్గుముఖం పడుతున్నాయి. అక్కడ కొత్తగా 11,699మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 58మంది మహమ్మారి ధాటికి మృతిచెందారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీకాల పంపిణీ..
దేశంలో ఇప్పటివరకు 87,07,08,636 టీకా డోసులను (covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సోమవారం ఒక్కరోజే 1,02,22,525 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల సంఖ్య (Global corona virus update) స్వల్పంగా పెరిగింది. తాజాగా 3,71,530 మందికి కొవిడ్ (Corona update) సోకింది. వైరస్ ధాటికి మరో 5,351 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,30,99,451కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,69,820కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికా - 81,409
- రష్యా - 22,236
- బ్రిటన్ - 37,960
- టర్కీ - 27,188
- ఇరాన్ - 14,470
- బ్రెజిల్ - 14,423
ఇదీ చూడండి: ఆరోగ్యానికి డిజిటల్ గుర్తింపు సాధ్యమేనా?