ETV Bharat / bharat

Corona cases in India : దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు - దేశంలో కొవిడ్ మరణాలు

దేశంలో కొత్తగా 8,318 కొవిడ్​ కేసులు (India covid cases) నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 465 మంది మరణించారు. ఒక్కరోజే 10వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.

covid cases
కరోనా కేసులు
author img

By

Published : Nov 27, 2021, 9:58 AM IST

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 8,318 మందికి కరోనా సోకినట్లు(Corona cases in India) తేలింది. వైరస్​ (Coronavirus India)​ ధాటికి మరో 465 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 10,967 మందికిపైగా కరోనాను జయించారు.

  • మొత్తం కేసులు: 3,45,63,749
  • మొత్తం మరణాలు: 4,67,933
  • యాక్టివ్​ కేసులు: 1,07,019
  • మొత్తం కోలుకున్నవారు: 3,39,88,797

టీకాల పంపిణీ

దేశంలో శుక్రవారం ఒక్కరోజే 73,58,017 కొవిడ్​ టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫలితంగా మొత్తం టీకాల పంపిణీ.. 1,21,06,58,262కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 569,876 మందికి కొవిడ్​​ (Corona update) పాజిటివ్​గా తేలింది. కరోనా​ ధాటికి 6,337 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 26,08,77,017కు చేరింది. మొత్తం మరణాలు 52,06,265కు పెరిగాయి.

దక్షిణాఫ్రికాలో తాజాగా కొవిడ్‌ కొత్త వేరియంట్‌ బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. 'బి.1.1.529'గా గుర్తించిన ఈ రకానికి సంబంధించి ఇంతవరకు 22 కేసులు బయటపడ్డాయి. క్రమేపీ ఈ వేరియంట్‌ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతున్నట్లు దక్షిణాఫ్రికా వైద్య, ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • జర్మనీలో కొత్తగా మరో 72,159 మందికి కొవిడ్ సోకింది. 374 మంది మరణించారు.
  • బ్రిటన్​లో కొత్తగా 50,091 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 160 మంది మృతి చెందారు.
  • అమెరికాలో కొత్తగా 37,686 మందికి వైరస్​ సోకింది. మరో 337 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 34,690 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,235 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో తాజాగా 34,436 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 60 మంది మరణించారు.
  • టర్కీలో కొత్తగా 24,002 కరోనా​ కేసులు నమోదవగా.. 201 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఉక్రెయిన్​లో కొత్తగా 15,936 కేసులు, 608 మరణాలు నమోదయ్యాయి.
  • పోలాండ్​(26,735), నెదర్లాండ్స్​ (21,278), ఇటలీ (13,686) సహా పలు దేశాల్లో రోజువారి కొవిడ్​ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.