ETV Bharat / bharat

Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు - దేశంలో కొవిడ్​ కేసులు

దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు(Covid in India) నమోదయ్యాయి. మరో 562 మంది మృతి చెందారు.

Covid cases
కరోనా కేసులు
author img

By

Published : Aug 4, 2021, 9:49 AM IST

Updated : Aug 4, 2021, 10:09 AM IST

భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 42,625 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మరణాల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. మరో 562 కొవిడ్​ బలయ్యారు. కొత్తగా 36,668 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది.

మొత్తం కేసులు: 3,17,69,132

మొత్తం మరణాలు: 4,25,757

కోలుకున్నవారు: 3,09,33,022

యాక్టివ్​ కేసులు: 4,10,353

టీకాల పంపిణీ

దేశంలో ఇప్పటివరకు 48,52,86,570 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 62,53,741 డోసులు అందించినట్లు తెలిపింది.

కొవిడ్ పరీక్షలు

మంగళవారం ఒక్కరోజే దేశంలో 18,47,518 మందికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 47,31,42,307కు చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పలు రాష్ట్రాల్లో ఇలా..

  • కేరళతో కొత్తగా 23,676 కేసులు నమోదయ్యాయి. మరో 15,626 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 148 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో తాజాగా 6,005 మందికి కరోనా సోకింది. 6,799 మంది కోలుకోగా.. 177 మంది మృతిచెందారు.
  • కర్ణాటకలో ఒక్కరోజే 1,674 కేసులు నమోదయ్యాయి. 1,376 మంది కోలుకోగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,129 కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 1,785 మంది కోలుకోగా.. 69 మంది మృతిచెందారు.
  • హిమాచల్​ ప్రదేశ్​లో తాజాగా 220 మందికి కరోనా సోకింది. 108 మంది కోలుకోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ‍‍‍ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు దాటిన కొవిడ్​ కేసులు

Last Updated : Aug 4, 2021, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.