ETV Bharat / bharat

దేశంలో మరో 39వేల కేసులు, 491 మరణాలు

author img

By

Published : Aug 8, 2021, 9:46 AM IST

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 39,070 మందికి కరోనా సోకింది. కొవిడ్​తో మరో 491 మంది మృతి చెందారు.

Covid cases
కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు శనివారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 39,070 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 491 మంది మరణించారు. తాజాగా 43,910 మంది కొవిడ్​ను జయించారు.

మొత్తం కేసులు: 3,19,34,455

మొత్తం మరణాలు: 4,27,862

కోలుకున్నవారు: 3,10,99,771

యాక్టివ్​ కేసులు: 4,06,822

వ్యాక్సినేషన్​

దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 50,68,10,492 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం కొత్తగా 55,91,657 డోసులు అందించినట్లు పేర్కొంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పలు రాష్ట్రాల్లో కేసుల వివరాలు ఇలా..

  • కేరళలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 20,367 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 139 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 6,061 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 128 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో ఒక్కరోజే 1,610 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 32 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 36,773కు పెరిగింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 61 మందికి కరోనా సోకినట్లు తేలగా.. వైరస్​ ధాటికి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,096 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 64 మంది మరణించారు.
  • గుజరాత్​లో 19 కేసులు నమోదు కాగా.. ఆ రాష్ట్రంలో టీకా తీసుకున్నవారి సంఖ్య 6,01,720కి చేరింది.
  • మధ్యప్రదేశ్​లో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • రాజస్థాన్​లో మరో 18 మందికి కరోనా సోకినట్లు తేలింది.
  • తమిళనాడులో కొత్తగా 1,969 మందికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి మరో 29 మంది మరణించారు.

ఇదీ చూడండి: పిడుగుపాటుకు 24 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.