భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona Update) స్థిరంగా ఉంది. కొత్తగా 42,766 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,10,048గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కేరళలో ఆదివారం లాక్డౌన్..
కేరళలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం లాక్డౌన్ను కొనసాగిస్తోంది ప్రభుత్వం. కఠిన నిబంధనల నడుమ కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు పోలీసులు. లాక్డౌన్తో ఆదివారం తిరువనంతపురంలో రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,78,615 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 7,752 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 221,077,480కు చేరగా.. మరణాల సంఖ్య 45,74,470కు పెరిగింది.
కొత్త కేసులు ఇలా..
- అమెరికా -58,682
- బ్రెజిల్- 21,804
- రష్యా- 18,780
- బ్రిటన్- 37,578
- ఫ్రాన్స్- 13,336
- టర్కీ-20,033
- ఇరాన్-20,404
- మెక్సికో-17,409