Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. మరో 2,927 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,252 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 60వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 23వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పైగా ఉంది.
- యాక్టివ్ కేసులు: 16,279
- మొత్తం మరణాలు: 5,23,654
- మొత్తం కేసులు: 4,30,65,496
- రికవరీలు: 4,25,25,563
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. మంగళవారం 21,97,082మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,89,19,40,971కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 6,24,537 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,806 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- జర్మనీలో 1,35,699 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 307 మంది మృతిచెందారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 97,498 మంది వైరస్ సోకింది. మరో 170 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 80,301 కరోనా కేసులు నమోదయ్యాయి. 82 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 42,541 కరోనా కేసులు బయటపడ్డాయి. 290 మంది వైరస్‌కు బలయ్యారు.
- ఇటలీలో 29,575 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 146 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: బూస్టర్‌తో కొవిడ్ దూరం.. తాజా అధ్యయనంలో వెల్లడి