భారత్‌లో రోజువారీ కొవిడ్ కేసులు (Coronavirus update) మళ్లీ పెరిగాయి. గురువారం ఒక్కరోజే 26,727 మంది (Covid cases in India) వైరస్ బారిన పడ్డారు. మరో 277 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 28,246 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు: 33,766,707
- మొత్తం మరణాలు: 4,48,339
- మొత్తం కోలుకున్నవారు: 3,30,43,144
- యాక్టివ్ కేసులు: 2,75,224
దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో.. ఒక్క కేరళలోనే 15,914 కేసులు(Kerala Corona Update) వెలుగు చూశాయి. మరో 122 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి.
టెస్టులు
గురువారం ఒక్కరోజే 15,20,899 కొవిడ్ టెస్టులు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్ పరీక్షల సంఖ్య 57,04,77,338కి చేరింది.
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 89,02,08,007 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 29న 64,40,451 వ్యాక్సిన్ డోసులను లబ్దిదారులకు అందించినట్లు తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి (Global corona virus update) కొనసాగుతోంది. కొత్తగా 4,88,487 మందికి కరోనా (Corona update) పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి 7,815 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,45,59,779కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,97,310కి పెరిగింది.
ఆయా దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికా - 1,13,922
- బ్రిటన్ - 36,480
- టర్కీ - 29,104
- రష్యా - 23,888
- బ్రెజిల్ - 27,527
- ఇరాన్ - 14,078
ఇదీ చూడండి: గర్భస్థ శిశువులపై కాలుష్య కాటు- నెలలు నిండకముందే జననం