Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే భారీగా తగ్గాయి. మరో 1,247మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. మరో 928 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 30లక్షల 45వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు సమీపించింది.
- యాక్టివ్ కేసులు: 11,860
- మొత్తం మరణాలు: 5,21,966
- మొత్తం కేసులు: 4,30,45,527
- రికవరీలు: 4,25,11,701
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. సోమవారం 16,89,995 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,72,15,865కు చేరింది. మరో 4,01,909 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 315,090 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 1,263 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- దక్షిణ కొరియాలో తాజాగా 47,743 కరోనా కేసులు నమోదయ్యాయి. 132 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 19,810 మంది వైరస్ సోకింది. మరో 48 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 19,303 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 8 మంది మృతిచెందారు.
- ఆస్ట్రేలియాలో 34,270 కరోనా కేసులు బయటపడ్డాయి. 10 మంది వైరస్‌కు బలయ్యారు.
- ఇటలీలో 18,380 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 79 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:'పెళ్లై ఏడాదైనా కాకుండా విడాకులా?.. అది అసాధరణ కష్టం కాదు'