దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా పెరిగింది. తాజాగా 11,466 మందికి కొవిడ్ పాజిటివ్‌గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India) ధాటికి మరో 460 మంది మృతి చెందారు.
- మొత్తం మరణాలు: 4,61,849
- యాక్టివ్ కేసులు: 1,39,683
- కోలుకున్నవారు:3,37,87,047
టీకాల పంపిణీ..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 52,69,137 డోసుల వ్యాక్సిన్ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,09,63,59,208కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 4,58,629 మందికి కొవిడ్ (Corona update) సోకింది. కరోనా ధాటికి 7,627 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,15,56,791 కు చేరింది. మొత్తం మరణాలు 50,79,774కి చేరాయి.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 72,358 మందికి వైరస్ సోకింది. మరో 1,339 మంది చనిపోయారు.
- రష్యాలో మరో 39,160 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,211 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 33,117 మందికి వైరస్ బారినపడ్డారు. మరో 262 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 28,662 కరోనా కేసులు నమోదవగా.. 196 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో కొత్తగా మరో 28,986 మందికి కొవిడ్ సోకింది. 188 మంది మరణించారు.
ఇదీ చదవండి:వైద్య రంగంలో విస్తరిస్తున్న పరిశోధనలు