దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతోంది. తాజాగా 11,067 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి సోకిన వారిలో మరో 94 మంది చనిపోయారు.
- మొత్తం కేసులు: 1,08,58,371
- యాక్టివ్ కేసులు: 1,41,511
- కోలుకున్నవారు: 1,05,61,608
- మొత్తం మరణాలు: 1,55,252
కొవిడ్ బారినపడిన వారిలో మరో 13,087 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 7 లక్షల 36 వేల 903 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 20.33 కోట్లు దాటింది.
దేశీయంగా ఇప్పటివరకు సుమారు 66 లక్షల మంది లబ్ధిదారులకు టీకా అందించినట్టు స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ.
ఇదీ చదవండి:రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి