ETV Bharat / bharat

Covid Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు - India total corona cases

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 6,990 కేసులు (covid cases in India) నమోదయ్యాయి. కొవిడ్​​ ధాటికి మరో 190 మంది మరణించారు. ఒక్కరోజే 10,116 మందికిపైగా వైరస్​ను జయించారు.

corona cases in India
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Nov 30, 2021, 10:01 AM IST

Corona Cases in India Today: భారత్​లో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 6,990 మందికి వైరస్​ సోకింది. వైరస్​​ ధాటికి మరో 190 మంది మృతి చెందారు. ఒక్కరోజే 10,116 మందికిపైగా కొవిడ్​​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనా యాక్టివ్​ కేసులు.. దాదాపు లక్షలకు తగ్గాయి.

  • మొత్తం కేసులు: 3,45,70,274‬
  • మొత్తం మరణాలు: 4,68,980
  • యాక్టివ్​ కేసులు: 1,00,543
  • మొత్తం కోలుకున్నవారు: 3,40,18,299

వ్యాక్సినేషన్

సోమవారం ఒక్కరోజే 78,80,545 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫలితంగా మొత్తం టీకాల పంపిణీ.. 1,23,25,02,767కు చేరింది.

అంతర్జాతీయంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కరోనా​​ కేసుల (coronavirus worldwide) సంఖ్య పెరిగింది. ఒక్కరోజే 4,44,453 మందికి కొవిడ్​​​ (Corona update) పాజిటివ్​గా తేలింది. 5,407 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26,23,71,931కి చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 5,224,403కు చేరింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు.. మరణాలు

  • అమెరికాలో కొత్తగా 68,445 మందికి కరోనా సోకింది. మరో 416 మంది మృతి చెందారు.
  • బ్రిటన్​లో తాజాగా 42,583 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 35 మంది మరణించారు.
  • జర్మనీలో కొత్తగా మరో 42,582 మంది కొవిడ్ పాజిటివ్​గా తేలింది. 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో మరో 33,860 కరోనా కేసులు వెలుగుచూశాయి. కాగా ఒక్కరోజే 1,209 చనిపోయారు.
  • ఫ్రాన్స్​లో తాజాగా 8,279 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 122 మంది మరణించారు.
  • టర్కీలో కొత్తగా 24,317 మందికి కరోనా నిర్ధరణ కాగా.. 189 మంది చనిపోయారు.
  • పోలాండ్​లో కొత్తగా 13,115 కేసులు, 18 మరణాలు వెలుగుచూశాయి.

మరోవైపు దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియంట్​ ఒమిక్రాన్(omicron variant)​ ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) సైతం ఒమిక్రాన్​పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యంత ప్రమాదకరమైన స్ట్రైయిన్​గా పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రపంచ దేశాలు కొవిడ్​ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తోంది.

ఇదీ చూడండి: మాస్కులపై పూత.. కొవిడ్​ నుంచి అదనపు రక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.