దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల్లో మరోసారి స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 24వేల 712 వైరస్ కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 1కోటీ 1లక్షా 23వేల 778కి చేరింది. మరో 312 మంది మహమ్మారికి బలవ్వగా.. మరణాల సంఖ్య 1లక్షా 46వేల 756కు పెరిగింది.
రికవరీ రేటు ఇలా..
బుధవారం ఒక్కరోజే 29వేల మంది వైరస్ను జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 96లక్షల 93వేల 173కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 83వేలకు తగ్గింది. దేశవ్యాప్త రికవరీ రేటు 95.75 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.45శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇవీ చదవండి: