దేశంలో కొత్తగా 16,488 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 113 మంది కొవిడ్‌తో మృతిచెందారు.
- మొత్తం కేసులు: 1,10,79,979
- మరణాలు: 1,56,938
- రికవరీల సంఖ్య: 1,07,63,451
- యాక్టివ్ కేసులు: 1,59,590
ఇదీ చదవండి: కొవిడ్ పరీక్ష చేసి.. స్మార్ట్‌ఫోన్‌కు సమాచారమిచ్చే చిప్
వైరస్ సోకిన వారిలో 12,771 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు మరోసారి తగ్గి.. 97.14కు చేరింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా మరో 7,69,904 మందికి కొవిడ్ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటీ 42లక్షల 42వేలు దాటినట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: కరోనా వైరస్ రకాలను ముందే పసిగట్టొచ్చు!