దేశంలో బుధవారంతో పోల్చితే గురువారం.. కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 12,881మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 101మంది వైరస్‌కు బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 1.56 లక్షలు దాటింది.
- మొత్తం కేసులు: 1,09,50,201
- మరణాలు: 1,56,014
- రికవరీల సంఖ్య: 1,06,56,845
- యాక్టివ్ కేసులు: 1,37,342
తాజాగా 11,987 మంది వైరస్ నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.32 శాతంగా నమోదవ్వగా.. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే సుమారు 4.22 లక్షల మందికి కొవిడ్ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 94.22 లక్షలకు చేరిందని పేర్కొంది.
ఇదీ చదవండి: దేశంలో 90 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ