దేశంలో కొవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 1,26,789 మంది మహమ్మారి బారినపడ్డారు. మరో 685 మందిని కొవిడ్ బలి తీసుకుంది.
- మొత్తం కేసులు: 1,29,28,574
- మొత్తం మరణాలు: 1,66,862
- కోలుకున్న వారు: 1,18,51,393
- యాక్టివ్ కేసులు: 9,10,319
ఇదీ చదవండి: 'మహా'లో కరోనా రికార్డు- ఒక్కరోజే 60 వేల కేసులు
కరోనా సోకిన వారిలో కొత్తగా 59,258 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 91.67 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.29 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 12లక్షల 37వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 25 కోట్ల 26 లక్షలు దాటింది.
9 కోట్లకు చేరిన టీకా లబ్ధిదారులు
తాజాగా.. 29 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 9.01 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి: 'వ్యాక్సినేషన్లో ఆ రాష్ట్రాలు మెరుగుపడాలి'