దేశంలో సోమవారం ఒక్కరోజులోనే 43లక్షలకుపైగా కరోనా టీకా డోసులను అందించింది ప్రభుత్వం. టీకా సరఫరా కార్యక్రమంలో ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.
ఇందులో 39,00,505 మందికి మొదటి డోసు, 4,00,461 మందికి రెండో డోసు ఇచ్చింది.
మొత్తం టీకాల పంపిణీలో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, బంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళకు 60శాతం వాటా ఉంది.
దేశంలో ఇప్పటివరకు 8,31,10,926 టీకా డోసులను పంపిణీ చేశారు. టీకా పంపిణీలో.. మహారాష్ట్ర(81,27,248), గుజరాత్(76,89,507), రాజస్థాన్(72,99,305), ఉత్తర్ప్రదేశ్(71,98,372), బంగాల్(65,41,370) తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి:- భారత్లో మరో 97 వేల మందికి కరోనా