భారత్‌లో కరోనా(Coronavirus update) కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 11,903 మంది (Covid cases in India) వైరస్ బారిన పడ్డారు. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 14,159 మంది కరోనాను జయించారు. దాంతో క్రియాశీల కేసుల సంఖ్య 252 రోజుల క్రితం నాటికి చేరుకుంది.
- యాక్టివ్ కేసులు: 1,51,209
- మొత్తం కోలుకున్నవారు: 3,36,97,740
- మరణాలు: 4,59,191
వ్యాక్సినేషన్..
భారత్‌లో టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. సోమవారం మరో 41,16,230 డోసుల వ్యాక్సిన్ అందించగా.. ఇప్పటివరకు 1,07,29,66,315 డోసుల టీకా పంపిణీ జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కొవిడ్ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 3,83,198 మంది వైరస్ (Corona update) బారినపడ్డారు. కరోనా ధాటికి 6,798 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,82,62,422 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 50,28,144 కి పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 59,288 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మరో 1,003 మంది మృతి చెందారు.
- రష్యాలో తాజాగా 39,008 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 1,178 మంది మరణించారు.
- బ్రిటన్‌లో ఒక్కరోజే 33,865 మందికి కొవిడ్ బారినపడ్డారు. మరో 292 మంది చనిపోయారు.
- టర్కీలో కొత్తగా 29,796 కొవిడ్ కేసులు నమోదు కాగా.. 224 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో కొత్తగా మరో 16,285 మందికి కొవిడ్ సోకింది. 142 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి:'డెంగీ' డేంజర్ బెల్స్- ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు