మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత దేశ భద్రతా దళాలు సరికొత్త యుద్ధ నీతిని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. చైనా, పాకిస్థాన్, అంతర్గత సవాళ్లను ఎదుర్కొనేలా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం(2.5 ఫ్రంట్ వార్) ఇకపై ఏమాత్రం సరిపోదని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
"చైనా, పాక్, అంతర్గత సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత భద్రతా దళాలు సుశిక్షితులై ఉన్నాయి. అయితే ఆ వ్యూహానికి కాలం చెల్లింది.
సరిహద్దుల్లేని యుద్ధానికి మనం సిద్ధం కావాలి. ఇది గత సంప్రదాయాలను కొనసాగించాలన్న ఆలోచనకు సంబంధించినది మాత్రమే కాదు. ఒక దేశంగా మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా మారతాం అనే అంశంతో ముడిపడినది."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
చైనా దురాక్రమణల విషయంలో ఇప్పటికే కేంద్రంపై అనేకసార్లు విమర్శలు గుప్పించారు రాహుల్.
ఇదీ చదవండి: రాహుల్కు పగ్గాల కోసం యూత్ కాంగ్రెస్ తీర్మానం