ETV Bharat / bharat

Vaccine for children: చిన్న పిల్లలకు టీకా ఎప్పుడు? ఎలా?

దేశంలో వేగంగా వ్యాక్సినేషన్​ సాగుతోంది. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, ఆ తర్వాత 45 ఏళ్లుపైబడిన వారికి, ఇప్పుడు 18 ఏళ్లు పైబడినవారికి టీకా అందిస్తున్నారు. కొవిడ్​ సెకండ్​ వేవ్​ కాస్త తగ్గుముఖం పట్టినా.. మూడో వేవ్​ వరకు పరిస్థితులు ఎలా ఉంటాయి? మరి ఇంతవరకు టీకా పొందని చిన్నపిల్లలకు రక్షణ ఎలా? వారికి వ్యాక్సిన్​​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఏయే కంపెనీలు చిన్నపిల్లలకు టీకా తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి?

Vaccine for children
చిన్న పిల్లలకు టీకా
author img

By

Published : Jun 24, 2021, 2:29 PM IST

కరోనా టీకా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సినేషన్​ కూడా వేగంగానే సాగుతోంది. అయితే.. కొన్ని దేశాల్లో చిన్నపిల్లలకు టీకా అందిస్తున్నా.. భారత్​లో ఎప్పుడు ఆ వయసు వారికి వ్యాక్సిన్​ ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కరోనా సెకండ్​ వేవ్​ పీక్​ తగ్గినట్లే కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇప్పటివరకు టీకానే పొందని 18 ఏళ్ల లోపువారు వైరస్​ను తట్టుకోగలరా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే.. దీనిపై ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టతనిచ్చింది. చిన్న పిల్లలకు వ్యాక్సిన్​పై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎప్పుడు అందుబాటులోకి..?

క్లినికల్​ ట్రయల్స్ ఉత్తమ ఫలితాలనిస్తే ఈ ఏడాది సెప్టెంబర్​-అక్టోబర్​లోగా చిన్నపిల్లలకు వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఎయిమ్స్​ డైరెక్టర్​ డా. రణదీప్​ గులేరియా.

తొలుత కొవాగ్జిన్​ వస్తుందా?

హైదరాబాద్​కు చెందిన భారత్​ బయోటెక్​ సహా పలు కంపెనీలు చాలా వేగంగా చిన్నపిల్లలపై ట్రయల్స్​ నిర్వహిస్తున్నాయని చెప్పారు గులేరియా.

'' చిన్న పిల్లల కోసం కచ్చితంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం వారిపై భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్​ క్యాండిడేట్​ క్లినికల్​ ట్రయల్స్​ జరుగుతున్నాయి. సెప్టెంబర్​-అక్టోబర్​లోగా ఆ ఫలితాలు వస్తే.. టీకా అందుబాటులోకి వస్తుంది. మరికొన్ని కంపెనీలు కూడా ట్రయల్స్​ వేగంగా నిర్వహించడం సానుకూలాంశం.''

- రణదీప్​ గులేరియా, ఎయిమ్స్​ డైరెక్టర్​

థర్డ్​ వేవ్​ చిన్నపిల్లలకే ప్రమాదమా?

కరోనా మూడో దశ చిన్నపిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఇండియన్​ అకాడమీ ఆఫ్​ పీడియాట్రిక్స్​ గత నెలలో ఓ నివేదిక విడుదల చేసింది.

అయితే.. యూకే, సింగపూర్​లో చిన్నపిల్లలపై కరోనా ప్రభావాన్ని బట్టి వారికి వీలైనంత త్వరలో 2-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.

ఏయే వ్యాక్సిన్లు?

భారత్​లో చిన్నపిల్లల కోసం భారత్​ బయోటెక్​ నుంచే రెండు వ్యాక్సిన్లు వచ్చే అవకాశముంది. ఇంకా జైడస్​ క్యాడిలా జైకోవ్​-డీ, సీరం నుంచి కొవావాక్స్​ ట్రయల్స్​ జరుగుతున్నాయి.

భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్​

ఐసీఎంఆర్​ సహకారంతో భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేస్తున్న స్వదేశీ టీకా ఇది. ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి భారత్​లో ఈ టీకా ఇస్తున్నారు. 2-18 ఏళ్ల వారిపై ట్రయల్స్​ జరుగుతున్నాయి.

  • 6-12 ఏళ్ల మధ్య వారికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు.
  • దేశవ్యాప్తంగా 525 కేంద్రాల్లో ట్రయల్స్​ జరుగుతాయి.
  • ఇప్పటికే ఎయిమ్స్​ పట్నా, ఎయిమ్స్​ దిల్లీల్లో చిన్నపిల్లలపై టీకా ప్రయోగాలు జరుపుతున్నారు.

భారత్​ బయోటెక్​ నాసల్​ వ్యాక్సిన్​/బీబీవీ154

భారత్​ బయోటెక్​ తీసుకొస్తున్న ఈ వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను గేమ ఛేంజర్​గా అభివర్ణిస్తున్నారు. చిన్న పిల్లలు ఇన్​ఫెక్షన్ల బారినపడకుండా ఈ టీకా నిరోధిస్తుందని చెబుతున్నారు. ఇంకా ముఖ్యంగా శ్లేష్మ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • చిన్నపిల్లలు, గర్భిణీలకు ఈ వ్యాక్సినే శ్రేయస్కరమని చెప్పారు భారత్​ బయోటెక్​ ఛైర్మన్​ కృష్ణ ఎల్ల. ఆరోగ్యవంతులైన వలంటీర్లపై ఇప్పటికే ఈ వ్యాక్సిన్​ క్యాండిడేట్​ ట్రయల్స్​ ప్రారంభమయ్యాయి.
  • ఈ వ్యాక్సిన్​ను ముక్కు ద్వారా అందిస్తారు.

జైడస్​ క్యాడిలా జైకోవ్​-డీ..

భారత్​లో చిన్నపిల్లల కోసం మొదట ఈ వ్యాక్సినే అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే 12-18 ఏళ్ల వయసు వారిపై ప్రయోగాలు తుది దశకు వచ్చాయి.

  • ఇప్పుడు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం ఎదురుచూస్తోంది.
  • అహ్మదాబాద్​కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్​ క్యాడిలా ఈ వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను అభివృద్ధి చేసింది.
  • డీఎన్​ఏ ప్లాస్మిడ్​ సాంకేతికతతో రూపొందించారు.
  • ఈ రెండో స్వదేశీ టీకాను 56 రోజుల వ్యవధిలో మూడు డోసులుగా ఇవ్వనున్నారు.

సీరం 'కొవావాక్స్'​..

అమెరికా కంపెనీ నొవావాక్స్​ రూపొందించిన వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను.. భారత్​లో కొవావాక్స్​ పేరుతో తీసుకురానుంది సీరం ఇన్​స్టిట్యూట్​. ఇక్కడే టీకా ఉత్పత్తి జరగనుంది.

  • ఈ జులైలో భారత్​లో చిన్నపిల్లలపై క్లినికల్​ ట్రయల్స్​ జరగనున్నట్లు తెలుస్తోంది.
  • ఇప్పటికే సీరం ఇన్​స్టిట్యూట్​.. కొవిషీల్డ్​ టీకాను తీసుకొచ్చింది. భారత్​లో తొలుత అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్​ ఇదే.

ఇవీ చదవండి: 'ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్‌ టీకాపై క్లినికల్‌ పరీక్షలు'

కొవిడ్​ను రెండు రోజులు అడ్డుకునే నాసల్​ స్ప్రే

nasal spray: 99% వైరల్​ లోడును తగ్గించే నాసల్​ స్ప్రే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.