తూర్పు లద్దాఖ్ సరిహద్దులో సంక్షోభానికి భారతే కారణమంటూ చైనా(China allegations on India) చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలను(India China Border News) నిర్ద్వంద్వంగా ఖండించింది. చైనా సైన్యం(China on Ladakh) ఏకపక్ష చేపట్టిన దుందుడుకు చర్యల వల్లే ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని స్పష్టం చేసింది.
సరిహద్దులో భారీ స్థాయిలో సైన్యాన్ని, ఆయుధాలను చైనా మోహరిస్తూనే ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. చైనా చేష్టలకు స్పందనగానే.. భారత బలగాలు సరైన ఏర్పాట్లు చేసుకున్నాయని తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం కోసం చైనా ప్రయత్నిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. సరిహద్దు ప్రతిష్టంభనపై భారత్ వైఖరిని ఇదివరకే స్పష్టంగా వెల్లడించిందని చెప్పారు. అయినప్పటికీ వాస్తవాలను విస్మరించి ఇలాంటి ప్రకటనలు చేయడాన్ని తప్పుబట్టారు.
లద్ధాఖ్ హింసత్మాక ఘటనకు కారణం భారతే అని చైనా ఆరోపించిన నేపథ్యంలో అరిందమ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. భారత్ ఇదివరకే ఈ అంశంపై స్పష్టత ఇచ్చిందని, చైనావి నిరాధార ఆరోపణలను బాగ్చి తెలిపారు.
ఇదీ చదవండి: