కొవిడ్ టీకాలను భారత్ నుంచి విదేశాలకు సరఫరా చేయడంలో ఎలాంటి నిషేధం విధించడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. దేశీయ అవసరాలకు సరిపడా ఉంచుకుని, విదేశాలకు టీకా ఎగుమతి చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
విదేశాలకు భారత్ సరఫరా చేసినంతగా మరే దేశం కొవిడ్ టీకాలను సరఫరా చేయలేదు. ఐరాస ఏర్పాటు చేసిన కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా.. 6 కోట్ల టీకా డోసులను, 75 దేశాలకు అందించింది.
భారత్లో వ్యాక్సినేషన్..
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. గురువారం సాయంత్రం నాటికి 5,46,65,820 టీకా డోసులను అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఒక్కరోజే.. 15,20,111 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు చెప్పింది.
ఇదీ చూడండి:' 'కొవాక్స్' కోసం భారత్ 1.1 బిలియన్ డోసులు'